E-Paper
Advertisement

Xiaomi Buds 6: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటల వినియోగం.. న్యూ ఇయర్ కానుకగా షియోమీ బడ్స్ 6 లాంచ్‌!

Xiaomi Buds 6: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటల వినియోగం.. న్యూ ఇయర్ కానుకగా షియోమీ బడ్స్ 6 లాంచ్‌!
Advertisement

Xiaomi Buds 6: షియోమీ తన ప్రీమియం ఆడియో వేరబుల్స్ లైనప్‌లో భాగంగా Xiaomi Buds 6ను అధికారికంగా విడుదల చేసింది. అత్యుత్తమ సౌండ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కొత్త ఇయర్‌బడ్‌లు.. ప్రస్తుతం చైనీస్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ఆడియో నాణ్యత మెరుగ్గా:

ఈ బడ్స్‌లో 24K గోల్డ్ ప్లేటెడ్ డయాఫ్రాగమ్‌తో కూడిన కస్టమ్ ట్రిపుల్ మాగ్నెట్ డైనమిక్ డ్రైవర్ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీనికి తోడుగా, ఆడియో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు Harman ట్యూనింగ్‌ను కూడా అందించారు. దీని వల్ల క్లియర్ వోకల్స్‌తో పాటు డీప్ బాస్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఎక్కువ సేపు ధరించినా..

Advertisement

ఇక డిజైన్ పరంగా చూస్తే.. షియోమీ బడ్స్ 6 సెమీ-ఇన్-ఇయర్ డిజైన్‌లో వస్తాయి. ప్రతి ఇయర్‌బడ్ కేవలం 4.4 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో, ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగకుండా ఉండేలా బయోమెట్రిక్ కర్వ్ ఆకారంలో డిజైన్ చేశారు. అలాగే ఛార్జింగ్ కేస్‌ను కాంపాక్ట్ పెబుల్ స్టైల్‌లో రూపొందించారు.

Also Read: అమెజాన్‌ డీల్ అదిరింది.. రియల్‌మీ 14X 5G ఫోన్ ఇప్పుడు బడ్జెట్‌లో 50MP కెమెరాతో!

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

ఈ Xiaomi Buds 6 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC) కు సపోర్ట్ చేస్తాయి. అలాగే, ఇండిపెండెంట్ రికార్డింగ్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ చేసే సదుపాయం కూడా ఉంది. అదనంగా, Xiaomi Find, Apple Find వంటి ఫీచర్లకు కూడా ఇవి అనుకూలంగా పనిచేస్తాయి.

35 గంటల బ్యాటరీ బ్యాకప్:

బ్యాటరీ లైఫ్ కూడా ఈ సెగ్మెంట్‌లో ఆకట్టుకునేలా ఉంది. ANC ఆఫ్‌లో ఉంటే.. మొత్తం మీద 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ వెల్లడించింది. అదే ANC ఆన్ చేస్తే, దాదాపు 20 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం వీటికి IP54 రేటింగ్ కూడా ఉంది.

ధర ఎంతంటే?

షియోమీ బడ్స్ 6ను రూ. 8,500 విడుదల చేశారు. ఇవి నెబ్యులా పర్పుల్, పెర్ల్ వైట్, టైటానియం గోల్డ్, మూన్ షాడో బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. వినియోగదారులు వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Also Read: గేమింగ్ ఫోన్లలో నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్.. 16GB RAM, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్తఫోన్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×