Vaku Luxos BOOMX TWS: ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ఎన్నో రకాల వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే ..వారికి అద్భుతమైన ఆప్షన్ దొరికింది. కేవలం రూ.699 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్, అదిరిపోయే సౌండ్ క్వాలిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌తో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేలా ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం వాడే గాడ్జెట్లు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. ముఖ్యంగా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ కనిపిస్తున్నాయి. అయితే.. మంచి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలామంది అనుకుంటారు. కానీ .. ఆ అపోహను తొలగిస్తూ ప్రముఖ బ్రాండ్ ‘వాకు’ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. అత్యంత తక్కువ ధర కేవలం రూ.699 కే ఇది మార్కెట్లో లభిస్తుండటంతో టెక్ లవర్స్ దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఈ ఇయర్ బడ్స్ చూడటానికి.. చాలా ప్రీమియంగా , ట్రెండీగా ఉన్నాయి. వైట్ కలర్ వేరియంట్‌లో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. చెవుల్లో.. పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. చక్కగా సరిపోయేలా వీటిని డిజైన్ చేశారు. అంతే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు, వర్కౌట్లు చేసేటప్పుడు లేదా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇవి చెవుల నుంచి జారిపోకుండా ఉంటాయి. చిన్న సైజు ఛార్జింగ్ కేస్ కారణంగా దీన్ని పాకెట్‌లో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఈజీగా క్యారీ చేయొచ్చు.
ఈ గాడ్జెట్ మెయిన్ అట్రాక్షన్ దీనిలోని లేటెస్ట్ టెక్నాలజీ. ఇందులో బ్లూటూత్ V5.4 వెర్షన్‌ను అందించారు. దీని వల్ల ఫోన్‌కి ఇయర్ బడ్స్‌కి మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మధ్యలో.. ఎలాంటి ఆడియో లాగ్ లేదా కనెక్షన్ కట్ అయ్యే సమస్యలు రావు. మీరు ఫోన్ నుంచి కాస్త దూరంగా వెళ్లినా సరే.. సిగ్నల్ డిస్టర్బ్ కాకుండా క్లియర్ ఆడియో వినిపిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్‌తో చాలా వేగంగా పెయిర్ అవుతుంది.
బడ్జెట్ ఇయర్ బడ్స్‌లో బ్యాటరీ బ్యాకప్ తక్కువగా.. ఉంటుందనే భయం చాలా మందికి ఉంటుంది. కానీ ఈ మోడల్ ఈ విషయంలో యూజర్లకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తోంది. ఈ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తంగా దాదాపు 60 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండానే అనేక రోజుల పాటు హ్యాపీగా వాడేయొచ్చు. మ్యూజిక్ లవర్స్‌కి,తరచూ కాల్స్‌లో బిజీగా ఉండేవారికి ఈ ఫీచర్ నిజంగా ఒక వరమనే చెప్పాలి.
Also Read: రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!
పాటలు వినేటప్పుడు మంచి బేస్ ఉంటేనే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ హెవీ బేతో పాటు క్రిస్టల్ క్లియర్ వాయిస్ క్వాలిటీని అందిస్తాయి. ప్రయాణాల్లో బయటి శబ్దాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. మ్యూజిక్ వినడానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అంతేకాకుండా వీటిలో స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫోన్ తీయకుండానే కేవలం ఇయర్ బడ్స్‌ను టచ్ చేయడం ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, మ్యూజిక్ ప్లే లేదా పాజ్ చేయడం, వాల్యూమ్ కంట్రోల్ చేయడం వంటి పనులన్నీఈజీగా చేయవచ్చు.
మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పని చేసే, చూడటానికి స్టైలిష్‌గా ఉండే ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.రూ.699 ధరకే 60 గంటల బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ బ్లూటూత్ V5.4 , డీప్ బేస్ వంటి ఫీచర్లు ఉండటం నిజంగా గొప్ప విషయమే. ఈ ధరలో మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. ఇది సరికొత్త ఫీల్ ను పంచుతుంది. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ కోరుకునే వారు నిరభ్యంతరంగా దీన్ని కొనొచ్చు.