E-Paper
Advertisement

Varanasi: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ హోర్డింగ్స్ వెనుక జక్కన్న హస్తం ఉందా?

Varanasi: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ హోర్డింగ్స్ వెనుక జక్కన్న హస్తం ఉందా?
Advertisement

Varanasi: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తన సినిమా ప్రమోషన్స్ లో ఉపయోగించే స్ట్రాటజీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు అంటే అది ప్రేక్షకుడి ఊహకు కూడా అందనిది. అలాంటిది ఇప్పుడు సడన్ గా వారణాసి నగరం అంతటా తాజాగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ సినిమా ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అనుమానాలను కూడా రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా వారణాసి నగరంలోని.. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాలలో ఎటు చూసినా భారీ హోర్డింగ్స్ కనిపించడం సంచలనంగా మారింది.

వారణాసిలో భారీ హోర్డింగ్స్..

ఇక్కడ ఏర్పాటుచేసిన ఈ భారీ హోర్డింగ్స్ లో ఎటువంటి సమాచారం లేకుండా.. కేవలం “2027 ఏప్రిల్ 7న థియేటర్లలో” అని మెన్షన్ చేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ సినిమా పేరు లేదా నటీనటుల వివరాలు ఏమీ లేకపోవడంతో ఇవి ఎవరు ఏర్పాటు చేశారని ఊహాగానాలు మొదలయ్యాయి .ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కేవలం తేదీతో ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ హోర్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఇది ఏ సినిమా? ఎవరి ప్రాజెక్ట్? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జక్కన్న మాస్టర్ స్ట్రాటజీ..

Advertisement

ఈ ఫోటోలు వారణాసి నుంచి వచ్చాయని తెలియడంతో చాలామంది ఇది జక్కన్న ప్లాన్ చేశారని కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి వారణాసి లోనే ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇది వారణాసి సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే రాజమౌళి తన స్ట్రాటజీ మొదలుపెట్టారని.. ఊహకు కూడా అందని ఆయన తెలివితేటలు ప్రేక్షకుడిలో సరికొత్త అంచనాలు రేకెత్తిస్తాయని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

also read:Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. స్వయంగా ప్రకటించిన మెగాస్టార్

ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారా?

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున జరుగుతోంది. షూటింగ్ చక చకా చేస్తూనే ప్రమోషన్స్ లో కూడా జోరు చూపిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి 2027 ఏప్రిల్ 7న వారణాసి పేరుతో ఈ పెద్ద సినిమా రాబోతోందన్న సంకేతాలు ఇస్తూ హైప్ పెంచుతోంది చిత్ర బృందం.

వారణాసి సినిమా విశేషాలు..

వారణాసి సినిమా విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు . బాలీవుడ్ నటుడు పృథ్వీరాజు సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ వీరి పాత్రలను రాజమౌళి పరిచయం చేశారు. పైగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పేరుతో సినిమాపై అంచనాలు పెంచిన జక్కన్న 2027 సమ్మర్ స్పెషల్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇప్పుడు భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో ఇది వారణాసి రిలీజ్ డేట్ అంటూ అభిమానులు నిర్ధారణకు వస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం స్పందిస్తుందేమో చూడాలి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×