E-Paper
Advertisement

Varanasi Movie: ‘వారణాసి’లో రాముడి పాత్ర కోసం మహేశ్ బాబు మూడు నెలలు ఏం చేశారో తెలుసా..

Varanasi Movie: ‘వారణాసి’లో రాముడి పాత్ర కోసం మహేశ్ బాబు మూడు నెలలు ఏం చేశారో తెలుసా..
Advertisement

Varanasi Movie: ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం “వారణాసి” (Varanasi). ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. అయతే రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక, పృధ్వీ రాజ్ కలిసి గ్లోబల్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో సినిమా గురించి చెప్పిన విశేషాలు ప్రస్తుంతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమా గురించి పలు అప్డేట్లు ఇచ్చిన రాజమౌళి ఈ ఇంటర్య్వూలో సినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు. అయతే ఇదే సందర్భంలో సినిమా కోసం మహేశ్ బాబు ఎంత కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో మహేష్ రాముడి పాత్ర వేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఆ పాత్ర కోసం, బాడీ స్ట్రక్చర్ కోసం ఆయన మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Varanasi: వారణాసిలో మరో ‘నాటు నాటు’ సాంగ్? షూటింగ్ పై మహేష్ బాబు క్లారిటీ?

Advertisement

మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ఆధునిక కాలపు పాత్రల లాగా కాకుండా, ఒక పౌరాణిక పాత్రకు ఉండాల్సిన గాంభీర్యం, రాజసం కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. కేవలం కండలు పెంచడం మాత్రమే కాకుండా, ప్రాచీన యుద్ధ కళ అయిన ‘కలరిపయట్టు’ ద్వారా శరీరాన్ని విల్లులా వంచడం, నిటారుగా నిలబడటంలో ఒక రకమైన క్రమశిక్షణను అలవర్చుకున్నారు. మూడు నెలల పాటు ప్రతిరోజూ ఈ శిక్షణ పొందడం వల్ల ఆయన నడకలో మరియు నిలబడే తీరులో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చిందని ఆయన స్వయంగా చెప్పారు.

Read also-BB Jodi 2 : శ్రీసత్యతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ డ్యాన్స్.. పెళ్లివరకు వెళ్లిన సదా..ఇది కదా అసలు ట్విస్ట్..

Advertisement

సాధారణంగా సినిమాల్లో హీరోలు పరిగెత్తేటప్పుడు స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ రాజమౌళికి ఈ సినిమాలో ఒక అథ్లెట్ లాంటి సహజమైన వేగం కచ్చితత్వం కావాలి. మహేష్ బాబు వృత్తిపరమైన అథ్లెట్లతో కలిసి కొన్ని నెలల పాటు పరుగులో శిక్షణ తీసుకున్నారు. పరుగు తీసేటప్పుడు కాళ్లు, చేతులు ఎలా ఉండాలి, శ్వాస ఎలా తీసుకోవాలి అనే సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టారు. “ఆరు నెలల కఠిన శిక్షణ తర్వాత ఆ ఒక్క షాట్ చూసుకున్నప్పుడు, నేను పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందనిపించింది. నా నడక, నా నిలబడే తీరు, నా కదలికలు… అన్నీ మారిపోయాయి” అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. కేవలం శారీరక మార్పులే కాకుండా, శ్రీరాముడి వంటి మహోన్నత పాత్రను పోషించేటప్పుడు ఉండాల్సిన ప్రశాంతత, ఏకాగ్రత కోసం ఆయన ఏడాది కాలం పాటు ఈ ప్రాజెక్ట్ కోసం సమయాన్ని కేటాయించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఆయన పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. ఈ సినిమాలో ఆయనను ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా చూస్తారని చిత్ర యూనిట్ చెబుతోంది.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×