E-Paper
Advertisement

MSVPG OTT: ఓటీటీలోను మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్?

MSVPG OTT: ఓటీటీలోను మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్?
Advertisement

MSVPG film OTT: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (MSVPG) డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో మెగా అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయిలో అందుకోలేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు కానీ శంకరా వరప్రసాద్ గారు సినిమా మాత్రం అభిమానుల ఆకలి తీర్చిందని తెలుస్తోంది.

ఏడు భాషలలో మన శంకర వరప్రసాద్ గారు..

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో తిరిగి డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 భారీ ధరలకు కైవసం చేసుకుంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి జీ5 అధికారక ప్రకటన వెల్లడించిన సంగతి తెలిసిందే . ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాని మరోసారి చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా థియేటర్లలో కేవలం తెలుగులో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఓటీటీలో మాత్రం ఏకంగా ఏడు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇన్వెస్టిగేషన్ అధికారిగా చిరు..

Advertisement

ఇలా ఓటీటీలో కూడా ఏడు భాషలలో విడుదలవుతూ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది అని చెప్పాలి. కేవలం దక్షిణాది భాషలే కాకుండా బెంగాలీ మరాఠీలతో కలిపి ఏడు భాషలలో ఒకేసారి ప్రసారం కాబోతోంది. థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అధికారిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక నయనతార శశిరేఖ అనే పాత్రలో కనిపించారు. ఈమె ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ గా సందడి చేశారు. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్ క్యామియో సినిమాకు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని స్వయంగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.

Also Read: Takshakudu Teaser: చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాట… ఆసక్తికరంగా తక్షకుడు టీజర్ రిలీజ్!

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×