E-Paper
Advertisement

Jr.NTR: జూ.ఎన్టీఆర్ కి అస్వస్థత.. ప్రశాంత్ నీల్ మూవీకి ఆలస్యం తప్పదా?

Jr.NTR: జూ.ఎన్టీఆర్ కి అస్వస్థత.. ప్రశాంత్ నీల్ మూవీకి ఆలస్యం తప్పదా?

Jr.NTR: టాలీవుడ్ దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్(NTR ). ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వచ్చే సినిమా కోసం.. ఒక్క పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారటంలో సందేహం లేదు. చివరిగా దేవర (Devara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని.. ఆ తర్వాత రూ.500 కోట్ల క్లబ్లో చేరి సక్సెస్ అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించినా.. చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వాయిదా పడ్డ ప్రశాంత్ నీల్ మూవీ..

అసలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సీక్వెల్ ఏంటని కొంతమంది విమర్శలు కూడా గుప్పించారు. కానీ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు యాక్షన్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. అటు రామోజీ ఫిలిం సిటీ లో నైట్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారట.

దేవర 2 కి కూడా వాయిదా తప్పదా..

వాస్తవానికి ఈయన దేవర సినిమా షూటింగ్ అప్పట్నుంచి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు జ్వరం రావడం తగ్గిపోవడం ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే కొంతకాలం రెస్టు తీసుకుని హెల్త్ ప్రాబ్లమ్స్ పూర్తిగా నయం అయిన తర్వాతే ప్రశాంత్ నీళ్ తో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారట ఎన్టీఆర్.. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి వాయిదా పడింది. ఇక ఈ ఏడాది సమ్మర్ కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కారణంగానే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక దీని బట్టి చూస్తే ఈ సమ్మర్ కి ఈ సినిమా రానట్టే అని చెప్పవచ్చు.

ALSO READ:Tollywood: దర్శకుడు శంకర్ కి మాతృవియోగం!

ఎన్టీఆర్ కి అస్వస్థత.. అందుకే వాయిదా..

మరోవైపు దేవర 2 సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న నందిగామలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన మిక్కిలినేని సుధాకర్ (Mikkilineni sudhakar) దేవర 2 షూటింగు మే నుండి ప్రారంభం అవుతుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు 2027 ఆఖరిలో ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా ప్రశాంత నీల్ మూవీ షూటింగు వాయిదా పడింది. అందుకే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాతనే ఎన్టీఆర్ దేవర 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా అటు ప్రశాంత్ సినిమా షూటింగ్ వాయిదా పడడం కారణంగా ఇటు దేవర 2 సినిమా షూటింగ్ కూడా వాయిదా పడనుంది. అలాగే దేవర 2 సినిమా రిలీజ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని సినిమా ఫినిష్ చేయాలి.. మే నుండి దేవర 2 షూట్ చేయాలని ఆశిద్దాం.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×