E-Paper
Advertisement

Jammu kashmir Avalanche: జమ్మూకాశ్మీర్‌లో మంచు ఉప్పెన.. భయానక దృశ్యాలు, వీడియో వైరల్

Jammu kashmir Avalanche: జమ్మూకాశ్మీర్‌లో మంచు ఉప్పెన.. భయానక దృశ్యాలు, వీడియో వైరల్
Advertisement

Jammu kashmir Avalanche: జమ్మూకాశ్మీర్‌లో కొన్నిరోజులుగా భారీగా మంచు కురుస్తోంది. భారీగా మంచు చరియలు విరిగిపడుతున్నాయి. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా సోనామార్గ్‌లో మంచు ఉప్పెన విరుచుకుపడింది. దీనికి సంబంధించిన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

జమ్మూకాశ్మీర్‌లో అర్థరాత్రి మంచు ఉప్పెన

Advertisement

జమ్మాకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు పడుతోంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పర్యాటకులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఈ పరిస్థితి కొన్నిరోజులు ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని సోనామార్గ్ ప్రాంతంలో మంచు ఉప్పెన ముంచెత్తింది.

ఒక్కసారిగా మంచు ఉవ్వెత్తున ఎగిసిపడింది మంచు. దీంతో చుట్టుపక్కల భవనాలు, రిసార్ట్ లను మంచు కమ్మేసింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

మంచు తుపాన్ కారణంగా ఎవలాంచ్ ఏర్పడిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అదృష్టవ శాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలియజేశారు. కాశ్మీర్‌లో అన్నిచోట్లా విపరీతమైన మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికితోడు చలిగాలులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి.

సీసీటీవీ కెమెరాలో భయానక దృశ్యాలు.. అంతా సేఫ్ 

ముఖ్యంగా శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పూంఛ్ చోట్ల దట్టమైన హిమపాతం కురుస్తోంది. రోడ్ల మీద కొన్ని అడుగుల మేరా మంచు పేరుకుపోతోంది. ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోగా, ఇక చెట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఎటుచూసినా దట్టమైన హిమపాతం కనిపిస్తోంది.

అధికారులు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హిమపాతం సంభవించే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఎగువ ప్రాంతాల్లో కొన్నిరోజులుగా అధిక హిమపాతం వెంటాడుతోంది. దీనివల్ల వేలాది మంది పర్యాటకులను అక్కడ చిక్కుకుపోయారు.

ALSO READ: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి, ఆ విమానం గురించి మరికొన్ని వివరాలు

శీతాకాలంలో ఆయా ప్రదేశాలను సందర్శించేందుకు ఎక్కువమంది వచ్చారు. బస్సులు, కార్లలో వచ్చినవారు ఎక్కువ మంది ఉన్నారు. సోనామార్గ్ లోయతోపాటు అనేక ప్రదేశాలలో గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ హిమపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో కాశ్మీర్‌లో మంచు కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసి వేశారు.

శ్రీనగర్ విమానాశ్రయంలో దాదాపు అన్ని విమానాలు రద్దు చేశారు. వందలాది మంది పర్యాటకులు లోయలో చిక్కుకున్నారు. ఖాజీగుండ్ – బనిహాల్ వద్ద ఉన్న నవియుగ్ సొరంగం దగ్గర మంచు పేరుకుపోవడంతో జాతీయ రహదారి 44ను మూసి వేసినట్టు అధికారులు తెలిపారు.

 

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×