E-Paper
Advertisement

వరణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..

వరణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..
Advertisement

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఎక్స్‌ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాల తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘కంసాహమ్నీదా’ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Read also-బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్‌బార్.. ఇది ఒక్కటి ఉంటే చాలు దద్దరిల్లిపోద్ది..

డిఫరెంట్ టైటిల్..

Advertisement

ఈ సాంగ్ ప్రోమోలో వరుణ్ తేజ్ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పొలాల మధ్య, ఊరి నేపథ్యంలో సాగే ఈ పాటలో వరుణ్ తేజ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘కంసాహమ్నీదా’ అనేది కొరియన్ పదం, దీనికి ‘ధన్యవాదాలు’ అని అర్థం. తెలుగు పాటలో కొరియన్ పదాన్ని వాడటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది.

థమన్ మ్యూజిక్..

ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాటను తనదైన గాత్రంతో మెప్పించే సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. థమన్ అందించిన మాస్ బీట్, సిద్ శ్రీరామ్ వాయిస్ కలిసి ఈ పాటను మరో చార్ట్‌బస్టర్‌గా మార్చేలా ఉన్నాయి. ప్రోమోలో వినిపించిన ట్యూన్ చాలా క్యాచీగా ఉంది.

Advertisement

Read also-ఏప్రిల్ 15న డోంట్ మిస్.. బుర్ర పాడు చేసే మలయాళం మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

నిర్మాణం

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ ‘కంసాహమ్నీదా’ పూర్తి లిరికల్ సాంగ్‌ను ఏప్రిల్ 11న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో ఒక కొత్త మేకోవర్‌తో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఈ ప్రోమో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×