E-Paper
Advertisement

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హోం సేఫ్టీ ట్రిక్.. ఇది నిజంగా దొంగలను ఆపుతుందా?

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హోం సేఫ్టీ ట్రిక్.. ఇది నిజంగా దొంగలను ఆపుతుందా?
Advertisement

Aluminium Foil Trick: ప్రస్తుతం ఇంటి సేఫ్టీ గురించి జనాల్లో అవగాహన చాలా పెరుగుతోంది. ఖరీదైన సెక్యూరిటీ సిస్టమ్స్ అందరికీ సాధ్యం కాక పోవడంతో.. చాలా మంది సింపుల్ DIY ట్రిక్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఒక సింపుల్ ట్రిక్ .. డోర్ హ్యాండిల్స్‌కు అల్యూమినియం ఫాయిల్ చుట్టడం. ఇది వినడానికి చిన్న విషయంలా అనిపించినా.. నిజానికి ఇది మీ ఇంటి భద్రతకు ఒక చిన్న హెచ్చరిక వ్యవస్థలా పని చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ట్రిక్ ఎలా ఉపయోగపడుతుంది ?  నిజంగా ఇది పనిచేస్తుందా? అనే విషయాలను గురించి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్యూమినియం ఫాయిల్ ట్రిక్ అంటే ఏంటి?

డోర్ హ్యాండిల్ చుట్టూ అల్యూమినియం ఫాయిల్ చుట్టడం అనేది చాలా సింపుల్ టెక్నిక్.ఇది ప్రత్యేకంగా మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా రాత్రి సమయంలో సేఫ్టీ కోసం ఉపయోగపడుతుంది. ఎవరైనా తలుపు హ్యాండిల్ తాకితే.. ఆ ఫాయిల్ చిట్లిపోవడం లేదా శబ్దం చేయడం ద్వారా మీకు వెంటనే అలర్ట్ ఇస్తుంది.

Advertisement

ఇది ఎలా పనిచేస్తుంది?
అల్యూమినియం ఫాయిల్ చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. ఎవరైనా బయట నుంచి తలుపు హ్యాండిల్ తిప్పడానికి ప్రయత్నిస్తే.. ఫాయిల్ కదులుతుంది లేదా చిట్లిపోతుంది. లేదంటే చిన్న శబ్దం వస్తుంది. దీని వల్ల మీరు ఎవరో తలుపు తాకారని వెంటనే గ్రహించగలుగుతారు. ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం లేకుండా ఒక అలారం లాగా పని చేస్తుంది.

ఈ ట్రిక్ ఎందుకు ఉపయోగకరం?
1. తక్కువ ఖర్చు:
అల్యూమినియం ఫాయిల్ తక్కువ ధరకే దొరుకుతుంది. ఎలాంటి ఖరీదైన సిస్టమ్ అవసరం లేదు.

Advertisement

2. ఈజీగా వాడొచ్చు:
ఎవరైనా సులభంగా చేయగలిగే పద్ధతి ఇది. ప్రత్యేకంగా ఎలాంటి టెక్నికల్ నైపుణ్యం అవసరం లేదు.

3. వెంటనే హెచ్చరిక:
ఎవరైనా తలుపు తాకినప్పుడు వెంటనే తెలిసిపోతుంది.

4. ఒంటరిగా ఉండే వారికి ఉపయోగం:
ప్రత్యేకంగా మహిళలు లేదా సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది చిన్న భద్రతా చిట్కాగా పని చేస్తుంది.

ఇది పూర్తిస్థాయి సెక్యూరిటీగా పని చేస్తుందా?
ఈ ట్రిక్ పూర్తి భద్రతను ఇవ్వదు. ఇది కేవలం ఒక హెచ్చరిక పద్ధతి మాత్రమే. దొంగలు లేదా అనుమానాస్పద వ్యక్తులను దీని ద్వారా పూర్తిగా ఆపలేం. అందుకే దీన్ని ఇతర భద్రతా చర్యలతో కలిపి ఉపయోగించడం మంచిది. ఇందు కోసం.

1.మంచి డోర్ లాక్స్
2.సీసీటీవీ కెమెరాలు
3. సెక్యూరిటీ అలార్మ్స్ ఉపయోగించడం అవసరం.

ఎప్పుడు ఉపయోగించాలి?
1.రాత్రి నిద్రపోతున్నప్పుడు
2.ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు
3.అనుమానాస్పద పరిస్థితులు ఉన్నప్పుడు
4. ట్రావెల్ సమయంలో ఇంటిని లాక్ చేసి వెళ్లేటప్పుడు (ఇది తర్వాత చెక్ చేయడానికి సహాయ పడుతుంది).

Also Read: రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోర్ క్లీనర్ తయారీ.. దీంతో మీ ఇల్లు మెరిసిపోవడం గ్యారెంటీ!

కొన్ని జాగ్రత్తలు:
1.ఫాయిల్ బాగా గట్టిగా కట్టాలి. లూజ్‌గా ఉండకూడదు.
2.పిల్లలు లేదా పెంపుడు జంతువులు తాకకుండా చూసుకోవాలి.
3.ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి.

అల్యూమినియం ఫాయిల్ ట్రిక్ చిన్నదైనా కూడా మంచి ఆలోచన. ఇది మీ ఇంటి భద్రతను పూర్తిగా కాపాడకపోయినా, ఒక అదనపు జాగ్రత్తగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఎవరైనా తలుపు తాకినప్పుడు వెంటనే గుర్తించడానికి ఇది మంచి పద్ధతి. తక్కువ ఖర్చుతో.. సులభంగా అమలు చేసే ఈ ట్రిక్‌ను మీరు కూడా ప్రయత్నించవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×