E-Paper
Advertisement

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!
Advertisement

Varun Tej:చేసిన సినిమాలు చేసినట్టే పోవడంతో వరుణ్ తేజ్‌కు ఇప్పుడు సూపర్ హిట్ ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి.ఈ క్రమంలో మేర్లపాక గాంధీతో చేసిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సూపర్ హిట్ అవడం కోసం ఎన్ని కష్టాలైనా పడతానంటున్నాడు ఈ మెగా ప్రిన్స్.రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 7న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవ్వడంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది మూవీ టీమ్.

ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, లిరికల్ సాంగ్స్ మంచి బజ్ తెచ్చుకున్నాయి కూడా.ముఖ్యంగా వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టేశాయనే టాక్ వినిపిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుణ్ తేజ్ చూపిస్తున్న కమిట్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Also read :జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!

ఈమధ్య షూటింగ్‌లో కాలికి దెబ్బ తగలడంతో డాక్టర్లు కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ, సినిమా కోసం రెస్ట్ కూడా తీసుకోకుండా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు వరుణ్ తేజ్.ఇంకా పూర్తిగా రికవరీ కాకుండానే చేతికర్ర పట్టుకుని నడుస్తూ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాని గట్టున వేసే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

ఒక ఈవెంట్ ముగిసిన వెంటనే మరో ఈవెంట్‌కు వెళ్లడం, మీడియా మీట్స్, వరుసగా ఇంటర్వ్యూలు, అభిమానులతో ఫోటోలు దిగడం, మీడియాతో సరదాగా మాట్లాడడం… ఇవన్నీ చూస్తుంటే వరుణ్ తేజ్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది.ఇక తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రాయలసీమలో వరుణ్ తేజ్ అక్కడి ప్రజలతో బాగా కలిసిపోయాడు.స్టార్ హీరో అన్న ఆలోచన లేకుండా అక్కడి ప్రజలతో మాట్లాడటం, ఫ్యాన్స్‌కు సెల్ఫీలు ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది.అంతేకాదు, రాయలసీమకు ప్రత్యేకమైన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఉలవచారు, మిరపకాయ బజ్జీలు వంటి వంటకాలను ఎంతో ఇష్టంగా తిన్నాడు వరుణ్ తేజ్.

Also read :బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

ఇక అవే ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడంతో… “వరుణ్ తేజ్ మరీ ఇంత ఫుడ్డీయా… అసలు తెలియదే!” అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే… “ఇది ప్రమోషన్ కాదు… ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి చేస్తున్న ఒక మంచి ప్రయత్నం” అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ కెరీర్‌ని ఒకసారి చూస్తే… ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేష్’ వంటి సినిమాలతో సక్సెస్ చూసిన ఈ మెగా ప్రిన్స్… ఆ తర్వాత వచ్చిన ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కెరీర్ ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుంది.ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే అన్న పట్టుదలతో ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

చూడాలి మరి… ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్‌కు అనుకున్న సక్సెస్‌ను అందిస్తుందో లేదో!

Related News

జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!

“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

‘జయం’ హీరోగా బన్నీ ఫిక్స్.. తర్వాత ఒక్కసారిగా నితిన్ ఎంట్రీ!

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

Big Stories

Advertisement
×