E-Paper
Advertisement

జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!

జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!
Advertisement

Kotha Soku:ఫోక్ సాంగ్స్… ఈమధ్య ఈ జానపదాలు తెలుగు రాష్ట్రాలను ఎలా షేక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక యూట్యూబ్‌లో కూడా మిలియన్ల వ్యూస్ వీటి సొంతం.

తాజాగా అలాంటి ఫోక్ టచ్‌తోనే కొత్త లిరికల్ సాంగ్‌ని వదిలింది ‘పళ్ళబురుసు’ సినిమా. “కొత్త సోకు” పదాలతో మొదలయ్యే ఈ పాట ఇప్పుడు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

Advertisement

“అంగి జూడే… అతడి పొంగు జూడే… దోతి రంగు జోడే…” అంటూ మొదలయ్యే హుక్ లైన్ వినగానే పల్లెటూరి జాతరలో నిలబడ్డట్టే అనిపిస్తుంది.ఒకప్పుడు గ్రామాల్లో జరిగే జాతరలు, బతుకమ్మలు, బోనాలు వంటివన్నీ ఊరంతా కలిసి ఎలా చేసేవారో… ఆ ఫీల్‌ని ఈ పాటలో చూపించే ప్రయత్నం చేసింది ‘పళ్ళబురుసు’ యూనిట్.

Also read :“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

Advertisement

అందుకే ఈ లిరికల్ సాంగ్ అలా వచ్చిందో లేదో ఆడియన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ పాటలో హీరోని రివీల్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పాలి.హీరో వేసుకున్న అంగీ, దోతి… అతని నడక, బాడీ లాంగ్వేజ్… గ్రామంలోని జనాలతో కలిసిపోయే తీరు… అన్నీ కలిసి ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ముఖ్యంగా కలర్‌ఫుల్ విజువల్స్, జాతర సెటప్, డాన్స్ స్టెప్స్ చూస్తుంటే థియేటర్‌లో ఈ పాటకు సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.ఇక సురేష్ గంగుల రాసిన పాట పూర్తిగా పల్లె యాసకు దగ్గరగా ఉండటమే ఈ పాటకు మెయిన్ ఎసెట్.మరోవైపు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన ఫోక్ బీట్స్‌ను మోడ్రన్ మ్యూజిక్‌తో మిక్స్ చేసిన విధానం కూడా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.మొత్తంగా పాత ఫోక్ సాంగ్‌కు కొత్త టచ్ ఇవ్వడంతో యూత్‌కి సినిమా బాగా కనెక్ట్ అవుతోంది.

Also read :కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

ముఖ్యంగా ఫోక్ ఇన్‌స్ట్రుమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్… అన్నీ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టాయి.ఇక ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో వస్తున్న ‘పళ్ళబురుసు’ సినిమా కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కినట్టుగా విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది.ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళి గౌడ్, ప్రజ్వల్, గోమతి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.

చూడాలి మరి… ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియన్స్‌ని ఇంకెంతగా అలరిస్తుందో!

Related News

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!

“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

‘జయం’ హీరోగా బన్నీ ఫిక్స్.. తర్వాత ఒక్కసారిగా నితిన్ ఎంట్రీ!

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

Big Stories

Advertisement
×