E-Paper
Advertisement

వామ్మో ..10 రోజుల్లో 100 కోట్లా .. చిన్నసినిమా చితగొట్టేస్తుందిగా!

వామ్మో ..10 రోజుల్లో 100 కోట్లా .. చిన్నసినిమా చితగొట్టేస్తుందిగా!
Advertisement

Vazha 2:బడ్జెట్ లేకుండా మ్యాజిక్ ఎలా చేయొచ్చో,చిన్న సినిమా తీసి కలెక్షన్స్ ని ఎలా కొల్లగొట్టవచ్చో మరోసారి ప్రూవ్ చేస్తుంది వజా 2 అనే మలయాళీ సినిమా. దీనికి పార్ట్ 1 గా గతేడాది వచ్చిన వజా కూడా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెల్సిందే. థియేట్రికల్ గానే కాకుండా అటు ఓటీటీ లోనూ సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుందీ సినిమా. అలా పార్ట్1 సక్సెస్ ఇచ్చిన జోష్ తో తెరకెక్కి గత వారం రిలీజ్ అయిన వాజా2 పార్ట్ 1 ని మించి ఉండటం విశేషం.యస్ ..ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా పది రోజుల రన్ కంప్లీట్ కాకముందే  ఏకంగా 100 కోట్ల మార్క్ ని దాటేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది మరి.

నలుగురు కుర్రాళ్ళ చుట్టూ తిరిగే యూత్ ఫుల్ డ్రామా

Advertisement

కథ విషయానికి వస్తే ఇది నలుగురు కుర్రాళ్ళ చుట్టూ తిరిగే యూత్ ఫుల్ డ్రామా ఇది. స్కూల్ లైఫ్ లో ఎందుకు పనికి రారు అని తినే ఈ నలుగురు ఫ్రెండ్స్ తమ ఉనికిని చాటుకోవడానికి పడే తపనను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాను మూడు చాప్టర్లుగా విభజించి, ఒకడు ఇండియాలో స్థిరపడాలని చూస్తే, మరొకడు కూలీ పనుల కోసం దుబాయ్‌ వెళ్లడం, ఇంకో ఇద్దరు ఎలాగైనా యూకేలో సెటిల్ అవ్వాలని చేసే ప్రయత్నాలను కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ నవీన్ ఎస్.ఏ . భారీ డైలాగులు, అనవసరపు బిల్డప్‌లు లేకుండా కేవలం సింపుల్ ఎమోషన్స్, క్లీన్ కామెడీతోనే కథను నడిపించారు. ముఖ్యంగా ఇందులోని థియేటర్ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నాయి. ఒక చిన్న రివెంజ్ పాయింట్‌కి డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఎక్కడా బోర్ కొట్టకుండా టైమ్ పాస్ చేయిస్తుంది ఈ చిత్రం.

పక్కింటి కుర్రాళ్లలా జీవించిన నలుగురు కుర్రాళ్ళు

Advertisement

నటీనటుల విషయానికి వస్తే, ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నలుగురు కుర్రాళ్లు సిజో వెట్టికల్ (Sijo Vettickal),జోమోన్ జ్యోతిర్ (Jomon Jyothir)సాఫ్ వన్  Saaf Wan) హషిర్ లు అసలు నటిస్తున్నట్లు కాకుండా, మన పక్కింటి కుర్రాళ్లలా జీవించేశారని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో వారి మధ్య ఉండే బాండింగ్, గొడవలు, ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయం యూత్ ని ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, అన్ని సినిమాలోని మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసినవే. మొత్తానికి చాలా తక్కువ బడ్జెట్ తోనే హై స్టాండర్స్ లో సినిమాని ఎలా తీయొచ్చో మరోసారి ప్రూవ్ చేసింది మలయాళీ సినిమా.మరో వైపు నెట్టింట్లో ఈ సినిమాపై పేలుతున్న జోకులు, పడుతున్న మీమ్స్, వేస్తున్న కౌంటర్స్ అన్నీ కలిపి సినిమాకి మరింత కలెక్షన్స్ కుమ్మరిస్తున్నాయ్.

యంగ్ ఆర్టిస్టులతో రీమేక్ చేస్తేనే ఆ అసలైన ‘కిక్’

అయితే పస్ట్ పార్ట్ లా ఇందులో ఎమోషనల్ సీన్స్ లోని ఇంటెన్సిటీ కాస్త తగ్గిందన్న టాక్ వినిపిస్తుంది. అయినప్పటికీ, ప్రస్తుత జనరేషన్ యువత కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే  ఇలాంటి యూనివర్సల్ సబ్జెక్టులు మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి కూడా. సో  దీన్ని డబ్బింగ్ చేసి వదలడం కంటే, మన తెలుగులోని టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్టులతో రీమేక్ చేస్తేనే ఆ అసలైన ‘కిక్’ ఉంటుందన్నది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ఇక  తాజాగా మన శంకర వరప్రసాద్ తో సాలిడ్ హిట్ కొట్టినసన్ షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి కూడా  ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ కావడం ఇక్కడ విశేషం. మరి తనదైన జడ్జ్మెంట్ తో సినిమా హిట్ పసిగట్టేసిన సాహు దీన్ని తెలుగులోకి ఏమైనా తీసుకొస్తాడో చూడాలి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×