SETWIN Expansion: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగ యువతకు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే సెట్విన్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా వేలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్ కు బాటలు వేస్తుంది. అయితే నియోజకవర్గాల్లోనూ సెట్విన్ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు సైతం అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఇది అమలు అయితే నిరుద్యోగులుగా యువత ఉండే అవకాశం లేకుండా ఉద్యోగంతో కొందరు.. స్వయం ఉపాధితో మరి కొందరు ముందుకు సాగనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యువత స్వయం ఉపాధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. వారిని ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ , స్వయం ఉపాధి కల్పించేందుకు ‘సెట్విన్’(సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఏటా 15వేల నుంచి 25వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. శిక్షణ ఇచ్చినవారికి స్వయం ఉపాధికోసం బ్యాంకు రుణాలను సైతం సబ్సిడీద్వారా అందజేస్తుంది. వారిని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ సెట్విన్ సంస్థను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సెట్విన్ లను స్థాపించి నిరుద్యోగు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భావిస్తుంది. అందుకోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సైతం ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో సెట్విన్ సంస్థను ఏర్పాటు చేయాలంటే ఒక్కో కేంద్రానికి 2 నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించినట్లు సమాచారం. టీహబ్ తరహాలో సెట్విన్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
Also read: మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!
జీహెచ్ఎంసీ పరిధిలో 22 సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి. అందులో చైతన్యపురి, అంబేర్ నగర్, ఏజీగార్డ్స్, ఈస్ట్ మారేడుపల్లి, ఈడీఐ బజార్, ఎర్రగడ్డ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, మీర్ అలాం, మోతిగల్లీ, ముషీరాబాద్, ఎన్బీటీ నగర్, నేరేడ్ మెట్, ఫిర్జాదిగూడ, పురాణహవేలీ, రామ్నాస్పుర, రియాసత్ నగర్, సీతాఫల్ మండి, విద్యానగర్, బోడ్డుప్పల్, యూసుఫ్ గూడ, మంగళ్ హట్, డిచ్ పల్లి ప్రాంతాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు 9 జిల్లాల్లో సెట్విన్ సెంటర్లు కొనసాగుతున్నాయి. సిద్దిపేట, కామారెడ్డి, గజ్వేల్, డిచ్‌పల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్, జహీరాబాద్, జడ్చర్ల, హుస్నాబాద్ లో సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 కేంద్రాలు ఉన్నాయి. మార్కెట్ లో డిమాండ్ల ప్రకారం కొత్తకొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు.
సెట్విన్ కేంద్రాల్లో 59 వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. అన్ని జాబ్ ఓరియంటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీషు, ఆటో క్యాడ్, సోలార్ ప్యానల్ ఇన్ స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్, మొబైల్ సర్వీసింగ్, సీసీ కెమెరా ఇన్ స్టలేషన్, రిపేరింగ్, డిప్లామా ఇన్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్, ట్యాలీ కోర్సులతో పాటు పలు కోర్సులు ఉన్నాయి. ప్రైవేటు సంస్థల కన్నా తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 47 ఫ్రాంచైజ్ కేంద్రాల ద్వారా సేవలు అందజేస్తున్నారు. ఒక్కో కోర్సు ఫీజు ₹1,000 నుండి ₹5,000 మధ్య మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. మురికివాడల్లోని కేంద్రాల్లో శిక్షణ పొందే అభ్యర్థులకు ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నారు. శిక్షణతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2026 నాటికి) ఈ సంస్థ ₹2.79 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఫిబ్రవరి 2026 నాటికి మొత్తం 16,814 మంది అభ్యర్థులు వివిధ కోర్సుల్లో రిజిస్ట్రర్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణంగా సెట్విన్ లో నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ట్యాలీ,ఆటో క్యాడ్, సోలార్ ప్యానల్ ఇన్ స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్, మరికొన్ని కోర్సులకు ఆదరణ ఉండటంతో ఆ కోర్సులను ప్రవేశపెట్టాం. తక్కువ కోర్సు ఫీజుతో శిక్షణ ఇస్తున్నాం. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం సెట్విన్ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ లక్ష్యంను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సెట్విన్ తో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇస్తున్నాం. ప్రతి ఏటా 15వేల నుంచి 25వేల మందికి శిక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి.
Also Read: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు