E-Paper
Advertisement

AK 47Film: వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్..ఆ స్పెషల్ డే విడుదల?

AK 47Film: వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్..ఆ స్పెషల్ డే విడుదల?
Advertisement

AK 47Film: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న వెంకటేష్ త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వీరి కాంబోలో రాబోతున్న మొట్టమొదటి చిత్రం ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam).

గాంధీ జయంతి రోజు ఆదర్శ కుటుంబం రిలీజ్..

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ఈ సినిమాని అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆదర్శ కుటుంబం..

Advertisement

ఇలా ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం నుంచి ఈ విషయంపై అధికారక ప్రకటన మాత్రం వెలువబడలేదు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన విషయాన్ని చిత్రబృందం అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ఎప్పటిలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకులందరికీ రాబోతున్నట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్నది మొదటి సినిమా అయినప్పటికీ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో వెంకటేష్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.

అనిల్ డైరెక్షన్ లో వెంకీ మామ సినిమా..

Advertisement

త్రివిక్రమ్ కథా రచయితగా చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలలో వెంకటేష్ నటించి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన డైరెక్షన్ లో మొదటిసారి ఆదర్శ కుటుంబం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు అలాగే ఇటీవల చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో క్యామియో చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆదర్శ కుటుంబం తర్వాత తిరిగి మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ బిజీ కానున్నారు.

Also Read: Actress Kavya: ఫస్ట్ టైమ్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న నటి కావ్య.. అసలు ఏమైంది?

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×