E-Paper
Advertisement

Air Cooler Tips: కేవలం రూ.500 ఖర్చుతో.. కూలర్‌ను ఏసీలా మార్చేయండి.. క్రేజీ టిప్స్ భయ్యా!

Air Cooler Tips: కేవలం రూ.500 ఖర్చుతో.. కూలర్‌ను ఏసీలా మార్చేయండి.. క్రేజీ టిప్స్ భయ్యా!
Advertisement

Air Cooler Tips: వేసవిలో ఏసీలు, కూలర్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏసీని కొనలేని వారు.. తక్కువ బడ్జెట్ లో వచ్చే కూలర్లను వాడుతుంటారు. అయితే కేవలం రూ.500 ఖర్చుతో సాధారణ లేదా పాత కూలర్ ను సైతం ఏసీ రేంజ్ కూలింగ్ వచ్చేలా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకి ఈ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కూలర్ ప్యాడ్స్ మార్చడం

సాధారణంగా కూలర్ నుంచి వచ్చే చల్లగాలి.. దాని గ్రాస్ లేదా హనీకోంబ్ ప్యాడ్స్ పై ఆధారపడి ఉంటుంది. గాలి వాటి గుండా ఎంత వేగంగా, సమర్థవంతంగా చొచ్చుకుపోతే కూలింగ్ అంత బాగా వస్తుంది. ఒక వేళ మీ కూలర్ లోని గ్రాస్ ప్యాడ్స్ పాత బడినట్లైతే దానిని తీసేసి.. వాటి స్థానంలో హనీకోంబ్ ప్యాడ్స్ వాడండి. దీని కోసం సుమారు రూ.200-300 మాత్రమే ఖర్చు అవుతుంది.

ఐస్ ప్యాక్‌లు లేదా గడ్డకట్టిన బాటిల్స్

Advertisement

ఏసీ రేంజ్ చల్లగాలి రావాలంటే కేవలం నీరు ఒక్కటే సరిపోదు. మరింత కూలింగ్ పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నింపి డీప్ ఫ్రిడ్జ్ లేదా ఫ్రీజర్ లో గడ్డకట్టేవరకూ ఉంచండి. తర్వాత ఆ ఐస్ బాటిళ్లను కూలర్ వాటర్ ట్యాంక్‌లో వేయండి. దీనివల్ల నీరు అతి త్వరగా చల్లబడి ఏసీ లాంటి గాలి వస్తుంది. లేదంటే మార్కెట్లో దొరికే ‘రీయూజబుల్ ఐస్ ప్యాక్స్’ (Reusable Ice Packs) కూడా వాడవచ్చు. దీనికి రూ.100 లోపే ఖర్చు అవుతుంది.

వాటర్ పంప్ చెకింగ్..

సాధారణంగా కూలర్ లో పోసిన నీరు.. ప్యాడ్లన్నింటికి సమానంగా అందాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఆశించిన స్థాయిలో కూలింగ్ లభించదు. ఈ కారణంగానే కూలర్ నుంచి వేడిగాలి వస్తుంటుంది. కాబట్టి ప్యాడ్లకు నీరు తరలించే పైపు సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ పైపునకు ఉండే చిన్న చిన్న రంధ్రాలు మూసుకొని ఉంటే దానిని పిన్నీసు లేదా సూదితో శుభ్రం చేయండి. పైపు బాగా పాడైందని భావిస్తే కొత్త పైపును అమర్చండి. దీని కోసం రూ.50-100 ఖర్చు అవ్వొచ్చు. ఇలా చేయడం ద్వారా కూలర్ ప్యాడ్లు మొత్తం తడిసి గాలి చల్లగా మారుతుంది.

క్రాస్ వెంటిలేషన్

Advertisement

సాధారణంగా చాలామంది ఓ తప్పు చేస్తుంటారు. కూలర్ ఉన్న గది తలుపులు, కిటికీలు అన్నీ మూసివేస్తుంటారు. అయితే ఈ ఫార్మూలా ఏసీకి వర్తిస్తుంది కానీ కూలర్ కు కాదు. కూలర్‌కు వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. కూలర్ వెనుక వైపు కిటికీ తెరిచి ఉంచితే అది బయటి ఉన్న తాజా గాలిని లోపలికి లాగుతుంది. అయితే గదిలో ఉండే ఉక్కపోతను బయటకు పంపడానికి  మరో కిటికీని కాస్త తెరిచి ఉంచాల్సి ఉంటుంది.

Also Read: AC Gas Tips: ఏసీ అడ్డదిడ్డంగా పనిచేస్తోందా? గ్యాస్ సమస్య ఉన్నట్లే.. ఇలా చేస్తే అంతా సెట్!

ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడకం

ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వాడకం పెరిగిపోయింది. కాబట్టి కూలర్ ఆన్ చేసే ముందు ఒక 10 నిమిషాలు గదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఆన్ చేయండి. ఇది గదిలోని వేడి గాలిని బయటకు పంపించి.. కూలర్ చేయబోయే పనిని తేలిక చేస్తుంది. ఫలితంగా కూలర్ మరింత సమర్థవంతంగా పనిచేసి.. త్వరితగతిన చల్లటి గాలిని గది అంతా వ్యాపింపజేస్తుంది. ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్య గమనిక: నిపుణుల సలహాలు, టెక్ వెబ్‌సైట్ లో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా ఈ కథనం అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: Motorola AC: మధ్యతరగతి స్పెషల్.. మోటరోలా ఏసీలు వచ్చేసాయోచ్.. వై-ఫై, యాప్ కంట్రోల్ మరెన్నో ఫీచర్లు!

Related News

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

Big Stories

Advertisement
×