E-Paper
Advertisement

Victory Venkatesh: స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాకి మూడో భాగం లేనటేనా..?

Victory Venkatesh: స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాకి మూడో భాగం లేనటేనా..?
Advertisement

Victory Venkatesh: తెలుగు ప్రేక్షకులకు దృశ్యం సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ చేసిన నటనకు భారీ ప్రశంసలు వచ్చాయి. దృశ్యం పార్ట్ 1..పార్ట్ 2 రెండూ కూడా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందుకే దృశ్యం 3 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కొన్ని అనిశ్చితి వార్తలు వినిపిస్తున్నాయి.

 

Advertisement

ఇటీవలి నివేదికల ప్రకారం.. వెంకటేష్ ప్రస్తుతం దృశ్యం 3 తెలుగు వెర్షన్ నుంచి కొంతకాలం వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందా? లేక కేవలం ఆలస్యం అవుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు దృశ్యం సినిమా అన్ని భాషల్లోనూ ఒక బలమైన బ్రాండ్‌గా మారింది. మలయాళంలో ఈ చిత్రానికి మోహన్‌లాల్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మూడు భాషల్లోనూ ఈ సినిమాలు ఘన విజయం సాధించాయి.

 

Advertisement

మలయాళ దృశ్యం 3 ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. అలాగే హిందీ వెర్షన్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే విషయం తెలుగు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.

 

త్రివిక్రమ్ తో వెంకీ మామ..

 

ఇంతకుముందు వెంకటేష్ స్వయంగా తన రాబోయే సినిమాల జాబితాలో దృశ్యం 3 ఉందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఏకే 47 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నారని సమాచారం. ఈ వరుస ప్రాజెక్టుల కారణంగానే దృశ్యం 3 ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

 

అయితే ఇంకా ఆశ పూర్తిగా పోయినట్లు కాదు. దృశ్యం 3కి ఎక్కువ షూటింగ్ రోజులు అవసరం ఉండవు. కావాలంటే వెంకటేష్ తన ఇతర సినిమాల మధ్యలో ఈ చిత్రాన్ని పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఫైనలైజ్ కాలేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దృశ్యం 3 తెలుగులో కొనసాగుతుందా లేదా అనేది త్వరలోనే తేలాల్సి ఉంది.

 

300 కోట్ల క్లబ్ లో వెంకీ..

 

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరారు ఈ హీరో. ఇక ఈ సంక్రాంతికి కూడా చిరంజీవితో.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో ఒక చిన్న కామియో రోల్ చేసి మెప్పించాడు. ఇక వెంకటేష్ తదుపరి సినిమా.. ఏమిటి అని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.

Also Read:Venkatesh: భార్య గురించి తొలిసారి స్పందించిన వెంకీ.. ఆ మాట తట్టుకోలేకపోయిందంటూ!

Related News

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×