E-Paper
Advertisement

Sangeeta Vijay: విజయ్ తో విడాకుల కోరిన ఆయన భార్య సంగీత ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Sangeeta Vijay: విజయ్ తో విడాకుల కోరిన ఆయన భార్య సంగీత ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement

Sangeeta Vijay: దళపతి విజయ్ – సంగీత స్వర్ణలింగం విడాకుల వ్యవహారం ఈరోజు సాయంత్రం నుంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. దాదాపు 27 ఏళ్లుగా కలిసి జీవించిన ఈ దంపతులు విడిపోతున్నారన్న వార్త అభిమానులను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ విషయం కోర్టు వరకు వెళ్లడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా, రాజకీయాల్లో టీవీకే పార్టీ అధినేతగా ఉన్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామం కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పెళ్లి ఎలా జరిగిందంటే..!

Advertisement

సంగీత స్వర్ణలింగం లండన్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1990ల మధ్యలో విడుదలైన విజయ్ సినిమా చూసిన తర్వాత ఆమె ఆయనకు పెద్ద అభిమానిగా మారింది. లండన్‌లో చదువుతున్న రోజుల్లోనే విజయ్‌కు లేఖలు రాసిన సంగీత, ఆయనను ప్రత్యక్షంగా కలవాలన్న ఆశతో చెన్నై వచ్చింది. షూటింగ్ సమయంలో కలిసిన ఈ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. చివరకు 1999 ఆగస్టు 25న హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత సంగీత ఎప్పుడూ లో-ప్రొఫైల్ జీవితాన్నే కొనసాగించింది. విజయ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమె మీడియాకు దూరంగా ఉండేది. కుటుంబం, పిల్లలపైనే ఎక్కువ దృష్టి పెట్టేది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జేసన్ సంజయ్ సినిమాలపై ఆసక్తి చూపుతూ దర్శకత్వ రంగంలో అడుగులు వేస్తున్నాడు. కుమార్తె దివ్య సాషా చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుంది.

ఆస్తి విలువ ఏంటంటే..!

Advertisement

ప్రస్తుతం లండన్‌లో ఉంటూ తన కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్న.. సంగీతకు ఏకంగా రూ. 400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పిల్లల విషయానికొస్తే.. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జేసన్ సంజయ్ (25), కుమార్తె దివ్య సాషా (20). సంజయ్ ఇప్పటికే ..వెట్టైకారన్.‌సినిమాలో తండ్రితో కలిసి కనిపించాడు. త్వరలోనే అతడు సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

అయితే తాజాగా సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తన భర్త మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, ఆ విషయం తనకు తీవ్ర మానసిక వేదన కలిగించిందని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, తనను సామాజికంగా, ఆర్థికంగా కూడా దూరం పెట్టారని ఆరోపించారు. ఈ కారణాల వల్లే విడాకులు తప్పనిసరి అయ్యాయని ఆమె కోర్టుకు తెలిపింది.

ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ తేదీని ఖరారు చేసింది. ఒకప్పుడు అభిమానిగా మొదలైన ప్రయాణం భార్యగా మారి, ఇప్పుడు కోర్టు వరకు రావడం చాలా మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారం ఎలాంటి నిర్ణయానికి చేరుకుంటుందో చూడాల్సి ఉంది.

ALSO READ: Movies Censor: సెన్సార్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు అలా జరగదంటూ..!

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×