E-Paper
Advertisement

Purushaha: ఇలస పులస ఎలా అయ్యిందంటే.. ఊపేస్తున్న ‘దేవనాయకి’ మాస్ నెంబర్!

Purushaha: ఇలస పులస ఎలా అయ్యిందంటే.. ఊపేస్తున్న ‘దేవనాయకి’ మాస్ నెంబర్!
Advertisement

Purushaha: ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో ‘పురుష:’ (Purushaha) మూవీపై భారీగానే అంచనాలు మొదలయ్యాయి. చిన్న సినిమా అయినప్పటికీ, ఇందులోని కంటెంట్.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందనేలా, ప్రమోషనల్ కంటెంట్‌తో తెలియజేస్తూ వచ్చారు మేకర్స్. ఇప్పుడు ఇందులో మాస్ ఆడియెన్స్ మెచ్చేలా అప్డేట్ వదిలారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ (Kalyan Productions) బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ కథ‌తో, భార్యాభర్తల చిలిపి తగాదాలతో ఎంటర్‌టైన్ చేసేలా, ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ఈ సినిమాను మేకర్స్ రెడీ చేస్తున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయం కాబోతున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ తాజా అప్డేట్ ఏంటంటే..

Also Read- Sangeeta Vijay: విజయ్ తో విడాకుల కోరిన ఆయన భార్య సంగీత ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అనంత శ్రీరామ్ సాహిత్యం

Advertisement

తాజాగా ఈ మూవీ నుంచి ‘దేవ నాయకి’ (Devanayaki Lyrical Song) అంటూ సాగే మాంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ పెప్పీ ట్యూన్‌ను అందించారు. సాహితి చాగంటి గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలాగే ఈ పాటకు భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అమైరా దస్తూర్ మూమెంట్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఇలస పులస ఎలా అయిందో తెలియాలంటే ఈ పాటను వినాల్సిందే, చూడాల్సిందే. మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించేలా ఈ పాటకు సాహిత్యం, స్టెప్పులు కుదిరాయి.

Also Read- Movies Censor: సెన్సార్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు అలా జరగదంటూ..!

మాంచి ఊపునిచ్చేలా..

Advertisement

‘సదువు సదువు అని అన్నాడు మా నాన్న
సదవబ్బ లేదు కానీ సరసమబ్బిందోయ్..
పనిసెయ్ పనిసెయ్ అని అన్నాది మా అమ్మ
పనులబ్బ లేదు కానీ, పరువమబ్బిందోయ్..
ఇలస పులస అయ్యావా దేవనాయకి’’ అంటూ.. మాంచి ఊపునిచ్చేలా ఈ సాంగ్ ఉంది. పాట వింటుంటే కచ్చితంగా కాళ్లకు పని చెప్పాల్సిందే. అనంత శ్రీరామ్ చమక్కులు అలా ఉన్నాయి మరి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని, కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలా, అందరినీ హాయిగా నవ్వించేలా ఉంటుందని చిత్ర నిర్మాత తెలిపారు. త్వరలోనే ట్రైలర్ వదిలి, ఆ తర్వాత గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Also Read- The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 పై హైకోర్టు కీలక తీర్పు..‌ సినిమా విడుదల ఉందా.. లేదా.. అంటే..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×