E-Paper
Advertisement

Vanda Devullu: విజయ్ ఆంటోని నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

Vanda Devullu: విజయ్ ఆంటోని నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!
Advertisement

Vanda Devullu: మల్టీ టాలెంటెడ్ పర్సన్ విజయ్ ఆంటోని (Vijay Antony), దర్శకుడు శశి (Sasi Director) కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆ సినిమా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక అందులోని సాంగ్ నిత్యం ఏదో చోట వినబడుతూనే ఉంటుంది. ‘బిచ్చగాడు’ అనంతరం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రాన్ని ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘బిచ్చగాడు’ సినిమాలోని ‘వంద దేవుళ్లే’ అనే పాట స్ఫూర్తితో ఈ సినిమాకు ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read- Psychological Thriller OTT: కోటీశ్వరుడి మాయలో అందాల పనిమనిషి… ఉక్కిరి బిక్కిరి చేసే భార్య బాగోతం… సిడ్నీ స్వీనీ హిట్ మూవీ తెలుగులో

‘మా’ అధ్యక్షుడు విష్ణు సపోర్ట్..

Advertisement

విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు (Vishnu Manchu) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ‘బిచ్చగాడు’ మాదిరిగానే ఏదో ట్విస్ట్ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. పోస్టర్ మాత్రం ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్‌లో కనిపించిన తీరు చూస్తుంటే.. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడటం ఖాయమని చెప్పొచ్చు.

Also Read- Chiranjeevi: ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పేసిన మెగాస్టార్.. మరిచిపోయినా మస్త్ కవర్ చేశారుగా!

రా అండ్ రస్టిక్ పాత్రలో..

Advertisement

విజయ్ ఆంటోని ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రని పోషిస్తున్నట్టుగా ఈ పోస్టర్ తెలియజేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రయూనిట్‌కు విష్ణు మంచు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా టీమ్ వెల్లడించింది. అలాగే పోస్టర్ వదిలిన మంచు విష్ణు టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.

Also Read- Allu Sirish: ముసిముసి నవ్వులతో ఆకట్టుకున్న కొత్తజంట.. భార్యను దగ్గరకు తీసుకుంటూ ప్రేమ కురిపించిన అల్లు శిరీష్..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×