E-Paper
Advertisement

Allu Sirish: ముసిముసి నవ్వులతో ఆకట్టుకున్న కొత్తజంట.. భార్యను దగ్గరకు తీసుకుంటూ ప్రేమ కురిపించిన అల్లు శిరీష్..!

Allu Sirish: ముసిముసి నవ్వులతో ఆకట్టుకున్న కొత్తజంట.. భార్యను దగ్గరకు తీసుకుంటూ ప్రేమ కురిపించిన అల్లు శిరీష్..!
Advertisement

Allu Sirish: టాలీవుడ్ హీరో అల్లు శిరీష్.. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన భార్య నయనిక రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఈ జంట ముంబైలో Lజరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2026లో కలిసి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది వీరి మొదటి పబ్లిక్ అపియరెన్స్ కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా గమనించారు.

ఈ ఈవెంట్‌లో ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ..ఫ్యాషన్ షోను వీరు ముందు వరుసలో కూర్చొని చూశారు. మొదట చూస్తే ఇది సాధారణ సెలబ్రిటీ అపియరెన్స్‌లానే అనిపించింది. కానీ కొన్ని క్షణాల తర్వాత ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడానికి కారణమైంది.

చూపు మార్చిన నయనిక..

Advertisement

నయనిక షోను చాలా ఫోకస్‌తో చూస్తూ ఉండగా, ఆమె ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. కొంతమందికి అవి సీరియస్‌గా కనిపించగా, మరికొందరికి కాస్త భయంగా కూడా అనిపించాయి. ఈ సమయంలో అల్లు శిరీష్ మాత్రం చాలా కూల్‌గా పక్కనే కూర్చొని తన ఫోన్‌లో బిజీగా కనిపించారు.

తర్వాత ఒక సమయంలో శిరీష్ నయనిక భుజంపై చెయ్యి వేసి చిన్న క్యూట్ మోమెంట్ క్రియేట్ చేశారు. ఈ సన్నివేశం వీడియోగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

కొంతమంది నయనిక ఎక్స్‌ప్రెషన్స్‌ను “స్కేరీ లుక్” అని.. చూపులతోనే భయపెట్టేస్తుంది గా అంటూ కామెంట్లు పెడుతుండగా , మరికొందరు “ఇది నార్మల్ రియాక్షన్ మాత్రమే” అని అంటున్నారు. ఇంకా చాలామంది ఈ క్లిప్‌ను మీమ్స్‌గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ముఖ్యంగా కనిపించిన విషయం సహజత్వం. ఎలాంటి ప్లాన్ లేకుండా, యాక్టింగ్ లేకుండా ఒక చిన్న క్షణం ఇలా వైరల్ కావడం ఆసక్తికరంగా మారింది. ప్రతి జంటలో కనిపించే సాధారణ సన్నివేశంలా ఇది అనిపించడంతోనే జనాలకు మరింత కనెక్ట్ అయింది. కానీ ఆమె చూపు పైన మాత్రం సోషల్ మీడియా యూసర్లు రకరకాలుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×