Best Mileage Cars Under Rs.5.5 Lakh: చాలా మంది మధ్య తరగతి కుటుంబ సభ్యులు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్ల కోసం వెతుకుతుంటారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న చీప్ అండ్ బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ తో సుమారు రూ. 5 లక్షల్లో లభించే 5 కార్ల ఏవో చూద్దాం..
మారుతి సుజుకి సెలెరియో అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ లలో ఒకటి. ఇది ఒక లీటర్ పెట్రోల్ తో ఏకంగా 26 కిలో మీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది 1.0-లీటర్ (998 సిసి), 3-సిలిండర్ K10C పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ లభిస్తుంది. మారుతి సుజుకి సెలెరియో బేస్ ధర రూ. 4.70 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది.
టాటా టియాగో బేస్ ధర రూ. 4.57 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 86 PS పవర్, 113 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో వస్తుంది. 4 స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్‌ను కలిగి ఉంది. సుమారు 25 కిలో మీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ ధర రూ. 5.47 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 83 PS పవర్, 113.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వైర్డు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్, బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్టు చేసే 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఈ కారు సుమారు 20 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ. 3.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 1.0-లీటర్, 3-సిలిండర్ K10C పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 65.71 bhp పవర్, 89 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్, USB కనెక్టివిటీతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ తో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఇది సుమారు 23 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
రెనాల్ట్ క్విడ్ 1.0 ధర రూ. 4.29 లక్షలు ఉంటుంది. ఇది వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఈ కారు సుమారు 21 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.
Read Also: టాటా నెక్సాన్ To MG విండ్సర్.. రూ. 20 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!