E-Paper
Advertisement

Comedy Drama OTT: మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Comedy Drama OTT: మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా
Advertisement

Comedy Drama OTT : ఓటీటీలోకి ఒక కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో కడుపుబ్బా నవ్వించే సీన్స్ చాలానే ఉన్నాయి. 40 ఏళ్లకు దగ్గరపడుతున్న టోనీ అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బెర్లిన్‌లో పిజ్జా మాస్టర్‌గా పనిచేస్తూ, గొప్ప రాపర్ అవ్వాలని అతను కలలు కంటుంటాడు. అయితే తన తల్లి హఠాన్మరణంతో అతను తన సొంత ఊరికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతనికి ఎదురైన వింత పరిస్థితులే ఈ సిరీస్. చూసే కొద్దీ చూడాలనిపించే సిరీస్ ఇది. దీని పేరు, ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ జర్మన్ కామెడీ-డ్రామా సిరీస్ పేరు ‘క్రాప్ హ్యాపెన్స్’ (Crap Happens). సీజన్ 1, 2026 ఫిబ్రవరి 26న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. మొత్తం 9 ఎపిసోడ్లతో ఒక్కోటి సుమారు 35 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. ఇందులో ఆంటోన్ ష్నైడర్ (టోనీ), అమాడియో లియో ఆర్న్డ్ట్ (చార్లీ), డిమిత్రిజ్ షాద్ (జానీ కారెరా), టుపాక్ (మాట్లాడే ఒక బాతు పిల్ల) లీడ్ రోల్స్ లో ఉన్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టోనీ అనే ఒక వ్యక్తికి 40 ఏళ్లు వచ్చినా సెటిల్ అవ్వకుండా, బెర్లిన్‌లో పిజ్జాలు చేస్తూ ఎలాగైనా పెద్ద ‘రాపర్’ అయిపోవాలని కలలు కంటుంటాడు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల వాళ్ల అమ్మ ఒక విచిత్రమైన ప్రమాదంలో చనిపోతుంది. దాంతో టోనీ తన సొంత ఊరైన ‘కక్కెన్’కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక అతనికి అసలైన షాక్‌లు తగులుతాయి. తన తల్లికి తనకంటే చిన్నవాడైన ఒక భర్త ఉన్నాడని, అంతకంటే ముఖ్యంగా తనకు తెలియకుండానే 13 ఏళ్ల కొడుకు ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఒక పక్క మ్యూజిక్ కెరీర్, మరోపక్క ఊహించని ఈ కొత్త బాధ్యతలతో టోనీ లైఫ్ గందరగోళంగా మారుతుంది.

ఇక ఆ ఊర్లో టోనీ చేసే హంగామా మామూలుగా ఉండదు. బాధ్యత లేని తండ్రిగా తన కొడుకుతో ఎలా సర్దుకుపోవాలి? మళ్ళీ తన మ్యూజిక్ ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలి? అనే ప్రశ్నల చుట్టూ కామెడీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. ముఖ్యంగా తన తల్లి పెంచుకున్న టుపాక్ అనే ఒక బాతు పిల్ల టోనీతో మాట్లాడటం ఈ సిరీస్‌లో ఒక క్రేజీ ఎలిమెంట్. చివరికి టోనీ ఈ పరిణామాలను ఎలా ఫేస్ చేస్తాడు ? రాపర్ అవ్వాలనుకునే అతని కోరిక తీరుతుందా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  రైతు ఆత్మహత్యలపై మూవీ… థియేటర్లలో విడుదలైన రెండున్నర ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×