Ranabaali Movie: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న ( Rashmika mandanna) పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ దేని గురించి అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 19వ శతాబ్దపు నాటి ఒక చీకటి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘విరోష్’ జంట సిద్ధమైంది. ఆ ఆసక్తికరమైన కథాంశం గురించి ఇప్పుడు చూద్దాం ..
‘రణబాలి’ సినిమా 1876-78 మధ్య కాలంలో రాయలసీమను వణికించిన ‘ధాత కరువు’ నేపథ్యంలో సాగనుంది. బ్రిటిష్ పాలనలో ఆహారం లేక లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఆ భయంకరమైన రోజులను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, క్రూరమైన పన్నులు వసూలు చేస్తూ ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్న బ్రిటిష్ అధికారులపై సామాన్యులు చేసిన పోరాటమే ఈ చిత్ర మెయిన్ పాయింట్.ఇక వలసవాద చరిత్రలో మరుగున పడిపోయిన ఈ వాస్తవాలను దర్శకుడు రాహుల్ చాలా పవర్‌ఫుల్‌గా వెండితెరపైకి తీసుకురాబోతున్నట్టు టాక్.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే గంభీరమైన పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో మెప్పించనుంది. బ్రిటిష్ వారి దమనకాండకు ఎదురు నిలిచే వీరుడిగా విజయ్ నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం సినిమా స్థాయిని మరింత పెంచింది. పెళ్లి తరువాత వచ్చే ఈ మూవీ లో విజయ్, రష్మికల కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రియల్ లైఫ్‌లో ఒక్కటైన విజయ్, రష్మిక, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ఏందయ్యా సామీ’ అనే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టును సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథలో ఉన్న దమ్ము చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ పక్కా అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సీరియస్ పీరియడ్ డ్రామాను కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విరోష్ జంట గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
also read: NTR Neel: డ్రాగన్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్.. ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా?