E-Paper
Advertisement

NTR Neel: డ్రాగన్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్.. ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా?

NTR Neel: డ్రాగన్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్.. ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా?
Advertisement

NTR Neel: సాధారణంగా ఒకసారి హీరో సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఇక ఆ స్టార్ హీరో పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అంటే.. ఇక ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అలాంటి కాంబో ఇప్పుడు అభిమానులలో ఊహించని క్యూరియాసిటీని పెంచేసింది అని చెప్పాలి. ఆ కాంబో ఏదో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth Neel). ఎన్టీఆర్.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమా చేసి సైలెంట్ గానే సక్సెస్ అందుకున్నారు.

అభిమానులకు సర్ప్రైజ్..

తర్వాత ప్రశాంత్ నీళ్ (Prashanth neel) దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అప్పటినుంచి ఈ సినిమా షూటింగు శర వేగంగా జరుగుతున్నా.. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు..కానీ అప్పుడప్పుడు ఎన్టీఆర్ బహిరంగంగా కనిపించినప్పుడు ఆయన ఈ సినిమా కోసం మైంటైన్ చేస్తున్న లుక్ చూసి అభిమానులు సరిపెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి అభిమానుల కోసం ప్రశాంత్ ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇచ్చారు. కానీ ఆ న్యూస్ వల్ల మళ్ళీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి.

డ్రాగన్ ఫస్ట్ లుక్ ఆ రోజే రిలీజ్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా ఫస్ట్ లుక్ ను ఎప్పుడు విడుదల చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఈ సినిమా నుండి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఫోటోలు లీక్ కాకుండా మేకర్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అందుకే పక్కా పగడ్బందీగా ఇప్పుడు డ్రాగన్ మూవీ నుంచి విడుదల చేసే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కచ్చితంగా మీడియాని షేక్ చేయడం ఖాయమని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మళ్లీ నిరాశలో అభిమానులు..

ఇదిలా ఉండగా మరొకవైపు ఎన్టీఆర్ బర్త్డే అంటే మే 20వ తేదీన ఆయన పుట్టిన రోజు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కోసం మరో రెండు నెలలు ఎదురు చూడాలా అంటూ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ లోపు సినిమా నుండి ఏదైనా చిన్న అప్డేట్ వదులుతారేమో చూడాలి.

అభిమానులకు ట్రీట్ ఇస్తారా?

Advertisement

ప్రశాంత్ నీళ్ , ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి డ్రాగన్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కానీ అధికారిక టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. ఇందులో ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.

 

also read: Tollywood: వారణాసిపై కమ్ముకున్న యుద్ధం నీడలు.. అయోమయంలో టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×