E-Paper
Advertisement

Mahesh Kumar Goud: డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు

Mahesh Kumar Goud: డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు
Advertisement

Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: జిల్లా అధ్యక్షులకు నేతలంతా సహకరించాల్సిందేనని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ మరోసారి నొక్కి చెప్పారు. ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీలకు సహకరించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని, ఈ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు పీసీసీ చీఫ్​ చెప్పారు. ఇటీవల జరిగిన డీసీసీ ట్రైనింగ్ లో 8 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయని, రాహుల్ ఆదేశం మేరకు వెంటనే ఆయా శాసన సభ్యులతో మాట్లాడానని పీసీసీ చీఫ్​ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు డీసీసీలకు తప్పనిసరిగా సపోర్టు చేయాలన్నారు. పార్టీ ఆదేశాలను బ్రేక్ చేయడం సరికాదన్నారు. పార్టీ కోసం నేతలంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. అప్పుడే పవర్ తో పాటు పార్టీ మరింత మెరుగ్గా ముందుకు సాగుతుందన్నారు.

నలుగురు రాజ్యసభ అవకాశం

ఇక రాహుల్ గాంధీని బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS)లు విమర్శించడం సరికాదన్నారు. అమాయకుడైన నేతపై ఆడిపోసుకోవడం సరికాదన్నారు. మోడీ ఎస్ప్టిన్ ఫైల్స్ లో అడ్డంగా దొరికిపోయాడన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆరెస్సెస్ సమాధానం చెప్పాలన్నారు.ఇక ఏయిర్పోట్ లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పై రాహుల్ గాంధీతో చర్చించామని, 16 మంది ఆశావాహుల జాబితాను రాహుల్ కు ఇచ్చామన్నారు. ఏఐసీసీ అభ్యర్ధులను ఎంపిక చేసిన తర్వాత, నామినేషన్ ప్రాసెస్ ఉంటుందన్నారు. సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుతున్నారని, అయితే రాష్ట్రం నుంచి ఒకరికి ఇస్తారా? ఇద్దరికి ఇస్తారా? అనేది నేడు తేలనున్నదన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ శక్తులకు రాజ్యసభలు అప్పగించిందని, కానీ తాము పార్టీ కోసం పనిచేసినోళ్లకు ఇస్తున్నామన్నారు. తెలంగాణ కోసం పనిచేసినోళ్లకు కేసీఆర్(KCR) ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేదన్నారు.

Advertisement

Also Read: Rajya Sabha: రాజ్యసభ సీటుపై వీడనున్న సస్పెన్స్.. అదృష్టం ఎవరికి వరించెనో..?

కేరళలో కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ స్టక్చర్ గురించి డీసీసీ లకు రాహుల్ అవగాహన కల్పించారన్నారు. డీసీసీ ల శిక్షణ తరగతులు స్ట్రిక్ట్ గా నిర్వహించామన్నారు. అయితే 10 రోజుల తరగతులలో 1 రోజు కంటే ఎక్కువ రోజులు రాని ఏపీ, తెలంగాణ కు చెందిన 8 డీసీసీ లకు ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ధర్డ్ ఫ్రంట్ పేరుతో తనకు మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలకు డబ్బు తానే పెట్టుకుంటా నని చెప్పారని, ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ ప్రశ్నించారు. తమ కార్యకర్తలు తలో రూపాయి వేస్తే వెయ్యి కోట్లు అవుతాయని సీఎం చెప్పారన్నారు. కానీ బీఆర్ ఎస్ నేతలు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మరోవైపు ఈ నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే కసరత్తు జరుగుతుందన్నారు. పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం ఇస్తారన్నారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

నక్సలైట్ సిద్ధాంతంతో

Advertisement

నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని, ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ ను తాము వ్యతిరేకించామన్నారు. పాకిస్థాన్ తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోకపోవడం దారుణమన్నారు. నక్సలైట్ సిద్ధాంతంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. కానీ ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం తప్పనిసరిగా ఉంటుందన్నారు. పొలిటిక్ లీడర్లైనా.. మావోయిస్టులైనా.. పేద ప్రజల కోసమే పోరాటం చేశామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతామన్నారు. తాము ఇప్పటి వరకు ఎవరినీ అడలేదని, తమను ఎవరూ సప్రందించలేదని పీసీసీ చీఫ్​ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Stree Nidhi MD: శ్రీనిధిలో సిత్రాలు.. 14 ఏళ్ల నుండి ఓకే వ్యక్తి ఎండీగా విధులు..?

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×