E-Paper
Advertisement

HBD Vijay Deverakonda: రౌడీ హీరో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మరి ఇష్టమైన కార్లు?

HBD Vijay Deverakonda: రౌడీ హీరో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మరి ఇష్టమైన కార్లు?
Advertisement

HBD Vijay Deverakonda: రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రౌడీ హీరో అనే బ్రాండ్ గా మారిన ఈయన తొలిసారి ‘నువ్విలా’ అనే చిత్రం ద్వారా చిన్న పాత్రతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించి, తన మేనరిజంతో అమ్మాయిల ఫేవరెట్ నటుడిగా మారిపోయారు. ఇక 2015లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు క్లైమాక్స్ లో అద్భుతమైన నటనను కనబరిచి.. అందరి చేత కంటతడి పెట్టించారు విజయ్ దేవరకొండ .

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా తొలి అడుగు..

అలాంటి ఈయన 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ‘ద్వారక’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అనుకున్నంత స్థాయిలో విజయం లభించలేదు. కానీ అదే ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అర్జున్ రెడ్డి లాంటి అబ్బాయి కావాలని అమ్మాయిలే కాదు సెలబ్రిటీలు కూడా తమ మనసులో కోరికను బయట పెట్టడం మనం ఎన్నో సందర్భాలలో చూసాము. అలా ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న రౌడీ హీరో పుట్టినరోజు ఈరోజు. 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విజయ్ దేవరకొండ ఫస్ట్ రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు ట్యూషన్ టీచర్గా పని చేసి కేవలం రూ.500 సంపాదించే వారట. ఈ విషయాలను ఆయనే స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. ఇకపోతే ఖుషీ సినిమా తర్వాతే తనకు చెప్పుకోదగ్గ ఆదాయం కూడా లభిస్తోందని తెలిపారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుత రెమ్యూనరేషన్..

విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇక ఈయన ఆస్తులు వివరాలతో పాటు ఈయనకు ఇష్టమైన కార్ కలెక్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

విజయ్ దేవరకొండ ఫేవరెట్ కార్ కలెక్షన్స్..

Advertisement

విజయ్ దేవరకొండకు కార్లు అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే లగ్జరీ కార్లను ఆయన కొనుగోలు చేశారు. అందులో భాగంగానే వోల్వో XC 90, ఫోర్డ్ మస్టాంగ్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, రేంజ్ రోవర్ వంటి విలాసవంతమైన లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి.

విజయ్ దేవరకొండ వ్యాపారాలు..

విజయ్ దేవరకొండ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు అలా వచ్చిన డబ్బుతో వ్యాపారం కూడా మొదలుపెట్టారు. రౌడీ క్లబ్ అనే ఒక ఫ్యాషన్ బ్రాండ్ ను ఏర్పాటు చేసిన ఈయన ఈ బ్రాండ్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలకు దుస్తులను విక్రయిస్తూ ఉంటారు.. అంతేకాదు యువతకు అందుబాటులో ఉండే ధరలలో ఈ దుస్తులు మనకు లభిస్తాయి. లేని వారికి ఉచితంగా రౌడీ హీరో తన బ్రాండ్ దుస్తులను అందించిన విషయం తెలిసిందే. అలాగే “కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ” పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించారు విజయ్ దేవరకొండ.

also read:HBD Sai Pallavi: సాయి పల్లవి రెమ్యునరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ ప్రస్తుత సినిమాలు..

ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో పాటు రౌడీ జనార్ధన సినిమాలలో నటిస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×