Sanjiv Goenka-Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో వారం పది రోజులు అయితే లీగ్ దశ కూడా పూర్తి అవుతుంది. మే 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Lucknow Super Giants vs Royal Challengers Bengaluru) మధ్య మొన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka) లాంటి బడా వ్యాపారవేత్తను విరాట్ కోహ్లీ ( Virat Kohli) అవమానించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆటోగ్రాఫ్ కోసం వస్తే అతన్ని వెయిట్ చేయించాడని విరాట్ కోహ్లీపై ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ప్లేయర్లు సరదాగా స్టేడియంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మనవడు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడట. దీంతో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరికి తన మనవడిని తీసుకువెళ్లాడు సంజీవ్ గోయెకా. అప్పటికే కేన్ మామతో విరాట్ కోహ్లీ డీప్ గా డిస్కషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సంజీవ్ ను చూసి విరాట్ కోహ్లీ పట్టించుకోనట్లుగా వ్యవహరించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 5 నిమిషాల పాటు సంజీవ్, అతని మనవడిని నిలబెట్టాడు విరాట్ కోహ్లీ. కేన్ మామ తో సొల్లు కబుర్లు పెట్టిన అనంతరం ఆటోగ్రాఫ్ ఇచ్చాడట విరాట్ కోహ్లీ. ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు వీడియో బయటకు రాలేదు కానీ.. దాదాపు 50 వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా ఉన్న సంజీవ్ గోయెంకాను నిలబెట్టిన వీడియో మాత్రం హాట్ టాపిక్ అయింది.
ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎంత స్టార్ అయినా… కొంతమంది సీనియర్ సిటిజెన్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో సంజీవ్ పాత్ర ఉంది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల దేవస్థానానికి కూడా విరాళాలు ఇచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. టాక్స్ లు సక్రమంగా కట్టి ఇండియా ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నారు. అలాంటి సంజీవ్ గోయెంకాను బిచ్చవాడిలా నిలబెడతావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. నీలాగా ఇండియా డబ్బులతో లండన్ లో సెటిల్ కాలేదని… ఇండియా కోసం పోరాడుతున్న వ్యక్తి అంటూ సంజీవ్ ను పొగుడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల విరాట్ కోహ్లీ మర్యాదగా మెదలాలని చురకలు అంటిస్తున్నారు.
Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ
The way Goenka and his grandson quietly waited for Virat Kohli to finish his chat with Kane Williamson before approaching him… such a small but classy gesture. ❤️ pic.twitter.com/dZHYInUVR6
— Out Of Context Cricket (@GemsOfCricket) May 9, 2026