E-Paper
Advertisement

కొత్త స్థలం.. కొత్త గ్రామం.. చెంచుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ప్యాకేజీలు ఇవే..?

కొత్త స్థలం.. కొత్త గ్రామం.. చెంచుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ప్యాకేజీలు ఇవే..?
Advertisement

Chenchu Rehabilitation: స్వేచ్ఛ బ్యూరో: అడవి వీడేందుకు సముఖత వ్యక్తం చేస్తున్న గ్రామాల ప్రజలకుప్రభుత్వం పునరావాస ప్రక్రియ వేగంగా చేపడుతుంది. వారికి మౌలిక వసతులతో పాటు భూమి, గృహ సదుపాయాలను కల్పిస్తుంది. తరలివెళ్లే కుటుంబాలకు బాచారం సమీపంలో మెరుగైన వసతులతో కూడిన గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది. అందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. నల్లమల అడవులలోని చెంచులను అడవి బయట మెరుగైన జీవనోపాధి, విద్య, వైద్యం కల్పించడం, కోర్ ఏరియాలో పులుల సంచారాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రక్రియ ప్రభుత్వం చేపడుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లాలో..

అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు. అయితే ఆ ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దోమలపెట్టం రేంజ్ -4, అమ్రాబాద్ రేంజ్-1 పరిధిలోని సర్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కొల్లంపెంట, వటవర్లపల్లి గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ గ్రామాలకు పునరావాస ప్రక్రియను నాగర్ కర్నూల్ జిల్లాలో చేపడుతున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తుంది. అయితే ఈ ఐదు గ్రామాల్లో ఎక్కువగా చెంచులు నివాస్తున్నారు. మొత్తం 1,088 కుటుంబాలకు గాను వీరిలో 471 కుటుంబాలు నగదు, 617 కుటుంబాలు పునరావాస ప్యాకేజీలను ఎంచుకున్నాయి. పునరావాసం కోరుకున్న వారికీ ప్రభుత్వం బాచారం ప్రాంతంలో 1501.88 హెక్టార్ల భూమిని కేటాయించింది. కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, మౌలిక వసతులతో కూడిన గ్రామ నిర్మాణం చేపడుతున్నారు. ‘కొత్త స్థలం – కొత్త గ్రామం – కొత్త ఆరంభం’ అనే నినాదంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

రెండు రకాల ప్యాకేజీలు..

Advertisement

ప్రభుత్వం ఈ గ్రామస్తులకు రెండు రకాల ప్యాకేజీలను అందిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వటవర్లపల్లి 671 కుటుంబాలు ఉండగా.. ఇందులో 311 మంది నగదు, 360 మంది పునరావాసం, సల్కలపల్లిలో 324 కుటుంబాలకు గాను 205 మంది నగదు, 119 మంది పునరావాసం, కుడిచింతల బైలులో 260 కుటుంబాలు ఉండగా, 166 మంది నగదు, 94 మంది పునరావాసం, కొల్లంపెంటులో 40 కుటుంబాలకు గాను 21 మంది నగదు, 19 మంది పునరావాసం, తాటిగుండల పెంటలో 25 కుటుంబాలు ఉండగా.. అందరూ పునరావాసం ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నగదు కోరిన ఒక్కొక్క కుటుంబానికి నేరుగావారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస ప్యాకేజీలో భాగంగా 2 హెక్టార్ల (సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమి), గృహ వసతి కల్పిస్తున్నట్లు వివరించారు.

ALSO Read: Frizzy hair: జుట్టు జిడ్డుగా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కా పాటించండి చాలు

ఎన్​టీసీఏ మార్గదర్శకాల ప్రకారం..

Advertisement

పునరావాస గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ మైక్రో ప్లానింగ్ పూర్తయింది. మౌలిక వసతుల కల్పన కొనసాగుతోంది. అంతేగాకుండా వారి జీవనోపాధి అభివృద్ధికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ సైతం ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత ఉంటుందని, కుటుంబాలు స్వయంగా పునరావాసం నిర్వహించుకోవచ్చని తెలిపారు. గ్రామాల నిర్వాసితులకు మైక్రో ప్లానింగ్ పూర్తి చేశారు. ఎవరికి ఎక్కడ భూమి, వసతి కల్పించాలనేదానిపై నిర్ణయం కూడా అధికారులు తీసుకున్నట్లు సమాచారం. పునరావాస ప్రక్రియ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్​టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జరుగుతోందని, దీనిపై ఎస్​డీఎల్​సీ, డీఎల్​సీ కమిటీల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పునరావాస కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.

చెంచుల కోరిక..

అడవిలో ఉంటే తమ పిల్లలకు మంచి చదువు, వైద్యం దక్కవని గుర్తించిన గ్రామస్తులు.. పదేళ్లుగా పునరావాసం కోసం స్వచ్ఛందంగా ఊళ్లను ఖాళీ చేస్తామని, తమకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారని తెలిపారు. 10 ఏళ్లుగా ప్రజల కోరిక మేరకు అడవిలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. చెంచుల కోరిక నెరవేరుతున్న తరుణంలో దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డాక్యుమెంటరీ ఆధారాలు..

ఇది ఇలా ఉంటే గ్రామాల తరలింపుపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా, గ్రామసభల ఆమోదంతో తరలిస్తున్నామని అధికారులు, గ్రామస్తులు చెబుతుండగా.. బలవంతంగా తరలిస్తున్నారని తమ హక్కులను కాలరాస్తున్నారని కొంతమంది ఎన్జీవోలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం బహిష్కరణ కాదని, ఇది స్వచ్ఛంద మార్పు అని పేర్కొంటున్నారు. ఐదు గ్రామాల్లో గ్రామసభ తీర్మానాలు ఆమోదించడం, ప్రతి దశలో డాక్యుమెంటరీ ఆధారాలు అందుబాటులో ఉన్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా ప్రతి లబ్దిదారుడి నుంచి వ్యక్తిగత సమ్మతి పత్రాలను సైతం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాల ప్రజలు మాత్రం అభివృద్ధి వైపు దృష్టిసారించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తీసుకున్న నిర్ణయంతో పులుల సంఖ్య సైతం అమ్రాబాద్ అడవుల్లో పెరిగే అవకాశం ఉంది.

Also read: సొంత కారు లేదు.. ఇల్లు లేదు.. దేశంలో నిరుపేద సీఎం మమతేనట!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×