Vijay Deverakonda:ప్రముఖ టాలీవుడ్ క్యూట్ జోడి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) తాజాగా ప్రముఖ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ (KWK 9) సీజన్ 9 షోలో సందడి చేశారు. ఇందులో తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ జంట..
అసలు రష్మిక చేత ఏడాది పాటు బ్రతిమలాడించుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయంపై విజయ్ దేవరకొండ స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఇకపోతే ఈ కాఫీ విత్ కరణ్ షోలో రష్మిక ఏడాది పాటు ప్రపోజ్ చేస్తే..ఆఖరికి పెళ్లికి ఒప్పుకున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు. దీంతో ఆయన పైన విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.. ఒక అమ్మాయి చేత అంతలా బ్రతిమలాడించుకోవాల్సిన అవసరం ఏముంది? అంటూ ఒక వర్గం విజయ్ దేవరకొండ పై మండిపడింది కూడా.. అయితే తాను అలా ఎందుకు రష్మిక చేత బ్రతిమలాడించుకోవాల్సి వచ్చింది అనే విషయంపై విజయ్ దేవరకొండ స్పందించారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు అని కరణ్ ప్రశ్నించగా .. రష్మిక మాట్లాడుతూ.. నేనే మొదట ప్రపోజ్ చేశాను. అయితే 100 సార్లు ప్రపోజ్ చేయాలని చెప్పాడు. కానీ నేను మాత్రం ఏడాది పాటు విజయ్ కి ప్రపోజ్ చేస్తూనే వచ్చాను.. నిజానికి మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. ఆ తర్వాతే విజయ్ కి ప్రపోజ్ చేయడం జరిగింది అంటూ రష్మిక తెలిపింది.
విజయ్ మాట్లాడుతూ ఆడవారు ఎప్పుడూ చాలా తెలివైన వారు. వారు మరింత పరిణితి చెందినవారు. కాబట్టే అన్ని విషయాలు వాళ్లకు ముందే తెలుస్తాయి.. అయితే భావోద్వేగంతో పెళ్లి వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే నన్ను నేను రోజు పరీక్షించుకున్నాను. ఆ బంధాన్ని పరీక్షించాను. మారుతున్న పరిస్థితుల్లో కూడా వివాహం సరైనదే అని అనిపిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఇదంతా జరుగుతున్నా కూడా వివాహం ఇంకా అంత ముఖ్యమైనది అనిపిస్తేనే మనం పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాను.
also read:నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి.. జాన్వీ వివాదంపై రష్మిక రియాక్షన్!
నిజానికి నేను బయటకు బాగా గంభీరంగా కనిపించినా.. లోపల చాలా సున్నితమైన వ్యక్తిని. గాయపడతానేమోనన్న భయం నన్ను జాగ్రత్తగా ఉండేలా చేసింది . నిజానికి నేను ఏదైనా జరగరాని జరిగితే చాలా బాధపడతాను. అందుకే ఆ భయం నన్ను మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇక్కడ దురదృష్టవశాత్తు రష్మిక నా భయాన్ని తన బాధగా భరించాల్సి వచ్చింది అంటూ తెలిపాడు. ఇక దీనిపై రష్మిక మాట్లాడుతూ విజయ్ ఆలోచనలను, భయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టే ప్రతిరోజు అడుగుతూ వచ్చాను . నేను చాలా రొమాంటిక్ అంటూ కూడా ఆమె తెలిపింది.
నేను డిసెంబర్ లో ఇటలీకి వెకేషన్ కి వెళ్ళినప్పుడు ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేశాను. కానీ చివరికి ఉదయపూర్ లో జరిగిన మా పెళ్లి వేడుకల సమయంలోనే రష్మికకి ప్రపోజ్ చేశాను. నాకున్న భయం వల్ల ఆ రొమాంటిక్ క్షణాన్ని కోల్పోవడం కంటే రష్మిక దాన్ని తన సొంతం చేసుకోవాలని నేను కోరుకున్నాను అంటూ విజయ్ తెలిపారు. మొత్తానికైతే ఈ క్యూట్ జంట తమ క్యూట్ లవ్ ను బయట పెట్టడానికి ముందు తమలో తాము ఎదుర్కొన్న ఆందోళనలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.