E-Paper
Advertisement

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్
Advertisement

Tanveer Ahmed Challenge To Indian batters:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న టి20 సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై అవలీలగా పరుగులు చేసిన టీమిండియా… న్యూజిలాండ్ గడ్డపై తేలిపోతుందని పరువు తీశారు. వెస్టిండీస్ పై అదరగొట్టిన టీమిండియా…. న్యూజిలాండ్ లో మాత్రం వైట్ వాష్ అవుతుందని హెచ్చరించారు నిజంగానే మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి రా అంటూ టీమిండియా బ్యాట‌ర్ల‌కు త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్ విసిరారు. దీంతో టీమిండియాపై త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ స‌వాల్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. ఎన్ని రోజులు 250కి పైగా పరుగులు సాధించిన టీమిండియా క్రికెటర్లు… న్యూజిలాండ్ గడ్డపై ఎలా పరుగులు సాధిస్తారో తాను చూస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూజిలాండ్ లో 100 నుంచి 150 పరుగుల కంటే ఎక్కువ చేయడం కష్టమేనని బాంబు పేల్చారు.

Advertisement

అభిషేక్ శర్మ, సంజు శాంస‌న్, శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ లాంటి చాలా మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ గడ్డపై బౌన్సర్లను ఎదుర్కొనే మొనగాడు లేడు అన్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఈ టి20 సిరీస్ లో ఉండి ఉంటే కథ మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. వాళ్ళిద్దరూ లేకపోవడంతో విదేశాలలో టీమిండియా టి20 జట్టు చాలా బలహీనంగా తయారైందని తెలిపారు. 250 పరుగులు సాధిస్తామని టీమిండియా క్రికెటర్లు మర్చిపోవాలని… 200 పరుగులు చేస్తే.. అదే గొప్ప అంటూ వ్యాఖ్యానించారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వైభవ్ సూర్యవంశీ తల పగలడం ఖాయం

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ న్యూజిలాండ్ గడ్డపై ఎలా ఆడతాడనే దానిపైన త‌న్వీర్ అహ్మ‌ద్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మొనగాడు అయిన వైభవ్ సూర్యవంశీ… అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం కష్టమేనని తాను మొదటి నుంచి చెబుతున్నట్టు గుర్తు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై అతన్ని ఆడించేందుకు గౌతమ్ గంభీర్ సాహసం చేయడం కష్టమేనన్నారు. ఒకవేళ అతడిని ఆడించినా ఫలితం పెద్దగా ఉండదని తెలిపారు. బౌన్సర్లకు అతని తల పగలడం ఖాయమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సాహసం చేయకుండా వైభవ్ రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టడం బెటర్ అన్నారు. ఒకవేళ గౌతమ్ గంభీర్ సాహసం చేసి వైభవ్ సూర్యవంశీని తుది జ‌ట్టులో ఆడిస్తే… అతడి అసలు రంగు బయట పడుతుందని హెచ్చరించారు. అందరి అంచనాలను మించి వైభవ్ ఆడితే, మాత్రం హీరో అవుతాడని తెలిపారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

Related News

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు…లబుషేన్ ను బండ‌బూతులు తిట్టిన పాట్ కమ్మిన్స్

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

Big Stories

Advertisement
×