E-Paper
Advertisement

Vijay -Rashmika: కొత్త కోడలికి ఆహ్వానం పలికిన విజయ్ సొంతూరు.. గృహప్రవేశం తో పాటు సత్యనారాయణ వ్రతం!

Vijay -Rashmika: కొత్త కోడలికి ఆహ్వానం పలికిన విజయ్ సొంతూరు.. గృహప్రవేశం తో పాటు సత్యనారాయణ వ్రతం!
Advertisement

Vijay -Rashmika:విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) ఎనిమిదేళ్ల తర్వాత తమ ప్రేమకు స్వస్తి పలుకుతూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉదయపూర్ లో జరిగిన రాయల్ వెడ్డింగ్ హడావిడి ముగిసిన వెంటనే తన మూలాలను వెతుక్కుంటూ విజయ్ తన భార్యను తీసుకొని సొంత ఊరికి రావడం అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలో ఉన్న తుమ్మన్ పేట విలేజ్ లో ఈ కొత్త జంట సందడి చేశారు. తమ సొంత ఊరి బిడ్డ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగి.. నేడు తన భార్యతో కలిసి వస్తున్నాడు అన్న వార్తతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నూతన జంట ఊరిలోకి అడుగుపెట్టగానే..ఆ ఊరి ప్రజల ఆనందం ఆకాశాన్ని తాకింది. కొత్త కోడల్ని సాంప్రదాయంగా తమ ఊరిలోకి ఆహ్వానించారు.

సొంత ఊరిలో కొత్త కోడలికి ఆహ్వానం..

ముఖ్యంగా స్థానిక ప్రజలు , బంధువులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి.. మంగళ వాయిద్యాలు, పూల దండలు, కుంభ హారతులతో ఈ జంటకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా రష్మిక మందన్న తన అత్తవారి వూరి మర్యాదలను చూసి తరించిపోయింది. విజయ్ తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. ఊరి పెద్దలను కూడా పలకరించారు. ముఖ్యంగా స్టార్ హోదాను పక్కనపెట్టి సామాన్య పల్లెటూరి జంటలా వారు అందరితో కలిసి పోవడంతో అక్కడున్నవారికి చాలా విశేషంగా అనిపించింది. ముఖ్యంగా తన ఊరిని , బంధువుల ప్రేమాభిమానాలను రష్మికకు పరిచయం చేశారు.

ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..

Advertisement

ఇకపోతే విజయ్ దేవరకొండ సొంత ఊరిలో ఉన్న ఫామ్ హౌస్ ను కొత్తజంట రాక కోసం అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం కొత్త కోడలితో జరిపే సత్యనారాయణ వ్రతాన్ని.. ఆ కుటుంబ సభ్యులు ఈ జంట చేత చేయించారు. నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో.. పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలి అనే కోరికతో సత్యనారాయణ వ్రతం జరిపించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సొంత ఊరిలో గృహప్రవేశం చేసి, శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈ జంట తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.

సెలబ్రిటీల కోసం ఘనంగా రిసెప్షన్.

ఉదయ్ పూర్ లో రాయల్ వెడ్డింగ్ నిర్వహించిన ఈ జంట హైదరాబాదులోనే సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈ రిసెప్షన్ కి పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.

Advertisement

also read:Hero Nikhil: అది శాపం కాదు.. యాదృచ్ఛికం.. రాజమౌళి హీరోలపై నిఖిల్ కామెంట్!

ఆహ్వానం లేనివారికి నో ఎంట్రీ..

ఇకపోతే అభిమాన నటీనటుల వివాహ వేడుకలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సరే అభిమానుల పెద్ద ఎత్తున తరలివస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అభిమానుల భద్రతా రీత్యా ఆహ్వానం లేని వారికి.. రిసెప్షన్ కి రాకూడదు అంటూ ఈ జంట ఒక నోట్ విడుదల చేసింది.. ఇక మొత్తానికి అయితే హైదరాబాద్ వేదికగా జరగబోయే ఈ రిసెప్షన్ మార్చి 4వ తేదీన బుధవారం ఘనంగా జరగనుంది. మరి ఎవరెవరు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారో చూడాలి.

 

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×