Hero Nikhil:ఒకప్పుడు ‘శాంతి నివాసం’ వంటి టీవీ సీరియల్ ద్వారా ఎపిసోడ్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి (Rajamouli ) సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1 వంటి చిత్రాలకు దర్శకుడుగా పనిచేసి దర్శకుడిగా సత్తా చాటారు.. ఆ తర్వాత ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. అలా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా అవతరించిన ఈయన.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తన ‘వారణాసి’ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు తమ తదుపరి సినిమాతో కచ్చితంగా ఫ్లాప్ ను చవిచూస్తున్నారనే కామెంట్లు ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళితో ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆ హీరోలు ఇతర దర్శకుల డైరెక్షన్లో సినిమా చేస్తే కచ్చితంగా అవి దాదాపు డిజాస్టర్ గానే నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో సినిమాలు చేసిన ఏ హీరోలైనా తమ తదుపరి చిత్రంతో డిజాస్టర్ చవి చూస్తారని ఒక సెంటిమెంటు దావాణంలా విస్తరిస్తున్న నేపథ్యంలోనే తాజాగా దీనిపై నిఖిల్ స్పందించారు.
ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిఖిల్.. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో..” రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు ఫ్లాప్స్ వస్తాయని ఇండస్ట్రీలో ముద్ర పడిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా..”అదేమీ శాపం కాదు.. అది కేవలం యాదృచ్చికం మాత్రమే.. శాపాలు, మూఢ విశ్వాసాలపై నమ్మకం లేదు. ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర చిత్రాలే అందుకు నిదర్శనం. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలనేది ప్రతి ఒక్క నటుడి కల ” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇన్ని రోజులు ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని విపరీతంగా వైరల్ చేసిన వారికి ఇది చెక్ పెట్టే అంశం అని చెప్పవచ్చు. ప్రస్తుతం నిఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేస్ ఫైల్.. లైంగిక వేధింపుల కేసులో!
నిఖిల్ స్వయంభు సినిమా విషయానికొస్తే.. పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో సంయుక్త మీనన్, నిఖిల్, నభా నటేష్ సంయుక్తంగా నటిస్తున్న చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వగా.. అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో సత్య, సునీల్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయ 2 తరువాత సరైన స్థాయిలో సక్సెస్ ఎదుర్కోక ఇబ్బందులు పడుతున్న నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాతో ఎలాగైనా సంచలనం సృష్టించాలని చూస్తున్నారు. మరి నిఖిల్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.