E-Paper
Advertisement

Fino Bank CEO Arrest: రూ. 840 కోట్ల భారీ స్కామ్.. DGGI వలలో చిక్కిన ఫినో బ్యాంక్ సీఈఓ!

Fino Bank CEO Arrest: రూ. 840 కోట్ల భారీ స్కామ్..  DGGI వలలో చిక్కిన ఫినో బ్యాంక్ సీఈఓ!
Advertisement

Fino Bank CEO Arrest: ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ రిషి గుప్తాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అరెస్ట్ చేశారు. దీంతో బ్యాంకింగ్ , ఆర్థిక రంగాల్లో సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్‌కు సంబంధించిన భారీ పన్ను ఎగవేత కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచిన DGGI అధికారులకు ఫినో బ్యాంక్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సుమారు రూ.13 కోట్లు విలువైన ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ కార్యకలాపాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సిండికేట్ నిర్వహణలో భారీగా వస్తు సేవల పన్ను (GST) ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అక్రమ లావాదేవీల్లో అధిక శాతం ఫినో బ్యాంక్ ఖాతాల ద్వారానే జరగడం గమనార్హం.

Advertisement

ఈ కుంభకోణంలో ఫినో బ్యాంక్ సుమారు రూ. 840 కోట్లు మేర ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు DGGI నిర్ధారించింది. గేమింగ్ కంపెనీలతో కుమ్మక్కై.. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పన్ను ఎగవేత మార్గాలను సుగమం చేయడంలో బ్యాంక్ ఉన్నతాధికారుల హస్తం ఉందన్న కోణంలో విచారణ జరిపిన అధికారులు చివరికి సీఈఓ రిషి గుప్తాను బాధ్యుడిగా పరిగణిస్తూ అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం రిషి గుప్తాను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లాయి? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఒక ప్రముఖ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఇన్వెస్టర్లలో, ఖాతాదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

Big Stories

Advertisement
×