E-Paper
Advertisement

Vijay Rashmika Wedding: విజయ్ రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26 కాదా?కొత్త డేట్ ఇదే..వీడియో వైరల్!

Vijay Rashmika Wedding: విజయ్ రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26 కాదా?కొత్త డేట్ ఇదే..వీడియో వైరల్!
Advertisement

Vijay Rashmika Wedding: టాలీవుడ్ క్యూట్ పెయిర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna) జంట ఒకటి. ఈ జంటకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ముస్తాబ్ అవుతున్న ఉదయపూర్ ప్యాలెస్..

విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు కానీ వీరి నిశ్చితార్థం ప్రైవేటుగా కొంతమంది సమక్షంలో జరిగిందని విజయ్ దేవరకొండ టీం వెల్లడించారు. ఇక రష్మిక విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లోని ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగబోతుందని ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇలా వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్న పెళ్లికి సంబంధించిన విషయాన్ని మాత్రం అధికారకంగా వెల్లడించలేదు.

ఫిబ్రవరి 2న విజయ రష్మిక పెళ్లి?

Advertisement

రష్మిక మందన్న పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో ఈమె పెళ్లి గురించి ప్రస్తావనకు రావడంతో కచ్చితంగా అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పారే తప్ప పెళ్లి తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 2వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చెప్పటం గమనార్హం. ఇక పెళ్లి పనులలో భాగంగా ఉదయపూర్ ప్యాలెస్ ఎంతో అందంగా ముస్తాబవుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

ఫిబ్రవరి రెండో తేదీ పెళ్లి అంటే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అయినప్పటికీ రష్మిక విజయ్ మాత్రం పెళ్లి గురించి వెల్లడించకపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఫిబ్రవరి రెండో తేదీ వీరి పెళ్లి కాదని ఇది కేవలం రూమర్ మాత్రమే అంటూ ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక దేవరకొండ పెళ్లి గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలో హల్ ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పరంగా వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ముచ్చటగా మూడోసారి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి అనే సినిమాలో వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించబోతున్నారు .

Also Read: Mega 158: మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా మెగా 158.. ఆ సినిమా ప్రభావమేనా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×