E-Paper
Advertisement

Mega 158: మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా మెగా 158.. ఆ సినిమా ప్రభావమేనా?

Mega 158: మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..  ఆలస్యంగా మెగా 158.. ఆ సినిమా ప్రభావమేనా?
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG) సినిమా మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బాస్టర్ హిట్ పడడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా అనంతరం చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబీ(Bobby) డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా 158 గా షూటింగ్ పనులను జరుపుకోబోతోంది ఈ సినిమా కోసం కాకా లేదా కాకాజీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కలకత్తా గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి.

నష్టాలు మిగిల్చిన జననాయగన్..

ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 2 వ వారంలో పూజ కార్యక్రమాలతో షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కెవిఎన్ ప్రొడక్షన్ వారు నిర్మాతలుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొడక్షన్ నుంచి విజయ్ దళపతి హీరోగా నటించిన జననాయగన్సినిమా విడుదల అయ్యి ఉంటే మెగా 158కు ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ సమస్యలు ఉండేవి కాదు. కానీ విజయ్ సినిమా విడుదల ఆలస్యం అవుతుంది దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని తద్వారా ఇప్పుడే కొత్త సినిమా చేసే ఆలోచనలో లేరు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మెగా 158 ఇప్పట్లో లేనట్టేనా?

Advertisement

ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మెగా 158 మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అభిమానులకు తదుపరి సినిమా మరింత ఆలస్యం అవుతుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ విషయంపై చిత్ర బృందం లేదా నిర్మాణ సంస్థ స్పందించాల్సి ఉంది. బాబి చిరంజీవి కాంబినేషన్లో ఇదివరకే వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చిరంజీవికి జోడిగా ప్రియమణి..

Advertisement

ఈ నేపథ్యంలోనే మరోసారి చిరంజీవి బాబి కాంబినేషన్ అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా ఆలస్యమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సీనియర్ నటి ప్రియమణి కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈమె దాదాపు కన్ఫామ్ అయినట్టు సమాచారం. చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో క్యామియో కూడా ఉండబోతుందని తెలుస్తోంది. వీటన్నింటికీ సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటనలు రాబోతున్నాయి.

Also Read; Venkatesh Remuneration: వరుస హిట్లు.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన వెంకీ మామ.. ఎంతంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×