E-Paper
Advertisement

దళపతి ‘విశ్వరూపం’.. 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

దళపతి ‘విశ్వరూపం’.. 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Vijay Victory :సీయం అవడం అటుంచండి..కనీసం గెలుస్తాడా అంటూ అంటూ ఎగతాళి చేసిన వాళ్ళ నోళ్ళని మూయిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి విజయడంకా మోగించాడు విజయ్.ఈ క్రమంలో సీయం కాబోతున్న విజయ్ కి ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా తమ విషెస్ చెప్పగా తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా విషెస్ చెప్పుకొచ్చాడు. అయితే విషెస్ చెబుతూనే విజయ్ పై తనదైన శైలిలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

అభినందనలు తెలిపిన సత్యరాజ్ 
విషయంలోకి వెళ్తే అందరిలాగే విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన సత్యరాజ్, అదే సమయంలో కొన్ని కామెంట్స్ చేసుకొచ్చాడు.ముఖ్యంగా రాజకీయాల్లో సిద్ధాంతాలే ప్రాణమని, ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రకటించినట్లుగా పెరియర్, అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉండాలని కోరాడు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా, సామాజిక సమానత్వం కోసం విజయ్ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు సత్యరాజ్.

Advertisement

also read :మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది.. కానీ ఆ పండ్లు కొనేముందు ఈ ఒక్క టెస్ట్ చేయండి!

ఫ్యూచర్లో కూడా తన సపోర్ట్ డీఎంకే పార్టీకే

Advertisement

అయితే ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే ఓటమి పాలు కావడం తనను బాధించిందని ఓపెన్‌గానే చెప్పడం ఇక్కడ గమనార్హం.ఏది ఏమైనా ఎన్నికల రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యూచర్లో కూడా తన సపోర్ట్ డీఎంకే పార్టీకే ఉంటుందని, తాను నమ్ముకున్న ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ఆయన కుండబద్దలు కొట్టేయడం విశేషం.

100కు పైగా  కైవసం చేసుకోవడం మిరాకిల్

ఇక మరోవైపు, తమిళనాట tvk పార్టీ సంచలన విజయం సాధించడం నేషనల్ వైడ్ గా డిబేటబుల్ అయిపొయింది.పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఏకంగా 100కు పైగా స్థానాలను కైవసం చేసుకోవడం ఒక మిరాకిల్ అనే చెప్పాలి.ఇక విజయ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించాడంటే విజయ్ పార్టీ పట్ల ప్రజలకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.

also read : దేవ కట్టా చేతికి ‘డ్రాగన్’ స్క్రిప్ట్.. ప్రశాంత్ నీల్ ఫెయిల్ అయినట్టేనా?

నెక్స్ట్ సీయం కావడం ఖాయం

ఇక ప్రస్తుతం విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా, అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో ఉన్నాడు. ఇతర చిన్న పార్టీలు లేదా ఇండిపెండెంట్స్ సపోర్ట్ తో విజయ్ తమిళనాడు నెక్స్ట్ సీయం కావడం ఖాయం.ఇక గతంలోనే విజయ్ తన ‘మెర్సల్’, ‘సర్కార్’ చిత్రాల్లోనే పొలిటికల్ ఇష్యూస్ రైజ్ చేయగా ఇపుడు ఏకంగా సీయం అవుతుండటం విశేషం.చూడాలి మరి మన కట్టప్ప చేసిన సూచనలని విజయ్ ఎలా పాటిస్తాడో.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×