Vijay Rashmika wedding: సినీ నటుడు విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ జంట పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాటను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుకకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి ఈ ఏర్పాటను రష్మిక విజయ్ దేవరకొండ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇలా పెళ్లి పనులలో ఈ జంట ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.
రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్లి అతిధులు వారి వివరాలు అలాగే వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్, పెళ్లి ఖర్చులు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ దేవరకొండ ఈ పెళ్లి వేడుకను పూర్తిగా ప్రవేట్ ఈవెంట్ లాగా చేసుకోబోతున్నారు చాలా తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి వేడుక జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ఉండడం కోసం ఈ జంట ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు సమాచారం.
పెళ్లికి వచ్చే కుటుంబ సభ్యులు అతిథులకు ఫోన్ అలో లేకుండా ఈ పెళ్లి వేడుకను నిర్వహించబోతున్నారు. ఇకపోతే ఈ పెళ్లిలో భాగంగా కొందరు వివిఐపీలు కూడా పాల్గొనబోతున్నారని అందుకే ఈ జంట రిసార్ట్ ను హై సెక్యూరిటీతో నిర్బంధించబోతున్నారని తెలుస్తోంది ఇలా సెక్యూరిటీ కోసం ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించి వారిని రంగంలోకి దించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్న ఇప్పటివరకు ఈ జంట మాత్రం పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాన్ని కానీ అధికారకంగా వెల్లడించలేదు.
హైదరాబాదులో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్…
మరొక మూడు రోజులలో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం అవుతున్నాయి .ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉదయపూర్ రిసార్ట్ లో వీరి వివాహపు వేడుకలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. 24 ,25,26 తేదీలలో వీరి పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట మార్చి నాలుగో తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. ఈ రిసెప్షన్ కోసం టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు, పలువురు రాజకీయ నాయకులు విజయ్ దేవరకొండ స్నేహితులు , అభిమానులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: Kalki part 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్..హైదరాబాద్ చేరుకున్న అశ్వత్థామ!