E-Paper
Advertisement

Mohan Bhagwat: ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న‌ వందే భారత్ రైలుపై రాళ్ల దాడి..

Mohan Bhagwat: ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న‌ వందే భారత్ రైలుపై రాళ్ల దాడి..
Advertisement

Mohan Bhagwat: ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. హర్దోయ్ జిల్లా కౌడా గ్రామం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢిల్లీ వైపు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం 3.20 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక కిటికీ అద్దం పూర్తిగా ప‌గిలింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే వర్గాలు ధృవీకరించాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు రైల్వే ట్రాక్ పక్కన క్రికెట్ ఆడుకుంటున్న 8 నుంచి 13 ఏళ్ల లోపు బాలలు సరదాగా రాళ్లు విసిరి ఉండవచ్చని సర్కిల్ ఆఫీసర్ అంకిత్ మిశ్రా వెల్లడించారు. ఈ దిశగా దర్యాప్తు కొనసాగుతోందని.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ భద్రత దృష్ట్యా ఈ ఘటనను అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.

Advertisement

మరోవైపు మోహన్ భగవత్ యూపీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఆయన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే భగవత్‌ను కలిశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం రాష్ట్రంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య.. బ్రజేష్ పాఠక్ కూడా ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. నిరాలా నగర్‌లోని ఆర్‌ఎస్ఎస్ కేంద్రంలో జరిగిన ఈ భేటీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర అగ్ర నాయకత్వానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు సందేశం పంపేందుకే ఈ వరుస భేటీలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేళ ఆర్‌ఎస్ఎస్ అధినేత పర్యటన.. ఆ వెంటనే జరిగిన ఈ రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Advertisement

Read Also: MLA Raja Singh: సెక్యూరిటీ వదిలేసి రా.. ఐదు నిమిషాల్లో తాడోపేడో తేల్చుకుందాం.. అక్బరుద్దీన్ కు రాజాసింగ్ సవాల్

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×