E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Trailer Tease: అది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు!

Ustaad Bhagat Singh Trailer Tease: అది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు!
Advertisement

Ustaad Bhagat Singh Trailer Tease: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అప్డేట్స్ వరదల్లా వచ్చి పడుతున్నాయి. మాములుగా అయితే ఫ్యాన్స్.. అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈసారి దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తూనే ఉన్నారు. కొత్త కొత్త పోస్టర్స్ వదిలి ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్న హరీష్ శంకర్.. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ టీజ్ (Ustaad Bhagat Singh Trailer Tease) అంటూ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ట్రైలర్ టీజ్ అంటే ఇదో రెండు సెకన్లు అలా కనబడి వెళ్లిపోవడం కాకుండా ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది. అంతేనా యాక్షన్‌తో పాటు ఓ డైలాగ్ కూడా ఇందులో యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టీజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇందులో చాలా యంగ్‌ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.

Also Read- Vijay Deverakonda: పెళ్లికి పిలవచ్చుగా.. చిన్నారికి విజయ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా!

దమ్మున్నోడు దాటొచ్చు

Advertisement

అసలు ట్రైలర్ టీజ్ ఎలా ఉందంటే.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభావవంతమైన డైలాగులు, శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్.. అభిమానులు, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్న గ్లింప్స్ ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. భగవద్గీత శ్లోకం ఒక వైపు వినిపిస్తుండగా.. పవర్ స్టార్ స్లైలిష్ ఎంట్రీతో అదరగొట్టేశారు. అడవిలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూపిస్తూ.. కౌబాయ్ తరహాలో పవన్ కళ్యాణ్‌ని ప్రజంట్ చేశారు. ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు’ అనే పవర్ ఫుల్ డైలాగ్ అనంతరం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఇందులో చూపించారు. ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్ ట్రీట్ ఇవ్వబోతుందనే విషయాన్ని ఈ టీజ్ తెలియజేస్తోంది. ఇందులో హీరోయిన్లను మాత్రం పరిచయం చేయలేదు.

Also Read- Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై టెన్షన్.. రాజా సాబ్ తప్పులు రిపీట్ కానున్నాయా..!

త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్

Advertisement

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలను స్వరపరచగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డ్యాన్స్ చేయిస్తే, తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళబోతున్నారని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సంగీత ద్వయం ప్రేక్షకులకు ఒక గొప్ప సంగీత అనుభవాన్ని ఇవ్వడం మాత్రం పక్కా అనేది ఇప్పటి వరకు వచ్చిన పాటలు, ఈ ట్రైలర్ టీజ్ తెలియజేస్తున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల అంటూ ఈ టీజ్‌లో మేకర్స్ తెలియజేశారు. మార్చి 19న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

Also Read- R.J.Suriya wedding: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ జె సూర్య.. ఫోటోలు వైరల్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×