E-Paper
Advertisement

Vijay Sangeeth Divorce: విజయ్ సంగీత విడాకులు.. భారీగా భరణం ఆఫర్ చేసిన హీరో!

Vijay Sangeeth Divorce: విజయ్ సంగీత విడాకులు.. భారీగా భరణం ఆఫర్ చేసిన హీరో!
Advertisement

Vijay Sangeeth Divorce: సినీ నటుడు విజయ్ థళపతి(Vijay Thalapathy) సంగీత(Sangeetha) విడాకుల విషయం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట 25 సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇలా 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన వీరు ఇప్పుడు విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఈ జంట ఎక్కడ స్పందించలేదు. అయితే ఇటీవల చంగల్ పట్టు కోర్టులో విడాకులు(Divorce) కోరుతూ విజయ్ భార్య సంగీత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

భార్యకు భారీభరణం ఆఫర్ ఇచ్చిన విజయ్..

ఈ విధంగా సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు చేయడంతో ఈ విషయం గురించి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే హీరో విజయ్ రాజకీయాలలోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే తన భార్య విడాకుల విషయాన్ని బయట పెడుతూ పిటిషన్ వేయడంతో విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఈ ప్రభావం చూపుతుందనే తెలుస్తుంది. త్వరలోనే ఈ విడాకుల పిటిషన్ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ తన భార్య సంగీతకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

సంగీతకు రూ. 250 కోట్ల భరణం..

Advertisement

ప్రస్తుతం విజయ్ సంగీత మధ్య చోటు చేసుకున్న వివాదాలను పక్కనపెట్టి వీరిద్దరూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. విడాకుల విషయంలో విజయ్ కోర్టు మెట్లు ఎక్కకుండా పిటీషన్ విత్ డ్రా చేసుకోవాలని అలాగే భరణం కింద తన భార్యకు 250 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ఈయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తన భార్య తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం విజయ్ సంగీతకు ఇంత పెద్ద మొత్తంలో భరణం ఆఫర్ చేశారని ఇండస్ట్రీ సమాచారం. అయితే సంగీత మాత్రం అందుకు సానుకూలంగా లేదని తెలుస్తోంది.

నటి త్రిష కారణంగా విడాకులు?

Advertisement

ఇలా విజయ్ సంగీత విడాకుల గురించి ఆయన ఇచ్చే భరణం గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా రాజకీయాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సంగీత ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోవడానికి కారణం ప్రముఖ నటి త్రిష అని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరూ జంటగా వెకేషన్ కి వెళ్తే ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఈ వార్తలకు బీజం పడింది అప్పటి నుంచి తరచూ వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక సంగీత ప్రస్తుతం విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ త్రిష గురించి వచ్చిన వార్తలు నిజమేనని అందుకే ఈమె విడాకులు కోరుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Happy Days 2: జెన్ జీ కోసం శేఖర్ కమ్ముల మరో ప్రయోగం.. ‘హ్యాపీ డేస్’ మళ్లీ రాబోతోందా?

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×