Disha Patani:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే మొదటి భాగంలో ప్రభాస్ సరసన ‘రోక్సీ’ పాత్రలో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పాత్ర మధ్యలోనే మాయమవ్వడంపై అప్పట్లో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. ఇక సీక్వెల్‌లో ఆమె ఉండదని అందరూ ఫిక్స్ అయిపోయిన వేళ, దిశా పటానీ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. పార్ట్-2లో తన పాత్రపై ఆమె ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కల్కి’ మొదటి భాగంలో దిశా పటానీ పాత్ర కొంతసేపు సందడి చేసి, ఆ తర్వాత కథ దీపికా పదుకొనే చుట్టూ తిరగడంతో ఆమె పాత్రకు ఎక్కువ సేపు కనిపించదు. ఇక దీంతో పార్ట్-2లో కేవలం ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఉద్ధండుల మధ్య పోరాటమే ఉంటుందని, దిశాకు చోటు ఉండదని అంతా భావించారు. కానీ, తన పాత్ర ఇంకా అయిపోలేదని దిశా క్లారిటీ ఇచ్చింది. సీక్వెల్‌లో కూడా తాను భాగమేనని, త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతానని చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. అర్థాంతరంగా ముగిసిన రోక్సీ పాత్రను నాగ్ అశ్విన్ రెండో భాగంలో ఎలా తీసుకువస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ:Ranabaali Movie: రణబాలి మూవీ స్టోరీ ఇదే.. విరోష్ జంట గట్టిగానే ప్లాన్ చేశారే?
మొదటి భాగంలో దిశాకు ఒక స్పెషల్ సాంగ్ ఉంది, కానీ సీక్వెల్‌లో మాత్రం పాటలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. అయితే అందరూ షాక్ అయ్యే విషయం ఏంటంటే, పార్ట్-1తో పోలిస్తే పార్ట్-2లో తన పాత్ర కు స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటుందని దిశా పేర్కొంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథలో వచ్చే కీలక మలుపుల్లో తన పాత్ర ప్రాధాన్యత ఉంటుందని హింట్ ఇచ్చింది. సీక్వెల్ మొత్తం సీరియస్ డ్రామాగా సాగనున్న నేపథ్యంలో, దిశా పాత్ర ఎక్కువగా ఉండటం విశేషం.
సాధారణంగా నాగ్ అశ్విన్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక పర్పస్ ఉంటుంది. మొదటి భాగంలో కేవలం కాంప్లెక్స్ పరిచయం కోసం వాడిన రోక్సీ పాత్రను, రెండో భాగంలో మరింత లోతుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ చూసిన ఎవరికైనా పార్ట్-2 రేంజ్ ఏంటో అర్థమైంది, ఇప్పుడు దిశా కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ముఖ్యంగా కమల్ హాసన్ పాత్ర అయిన ‘యాస్కిన్’ ఎదురుదాడి చేసే క్రమంలో రోక్సీ పాత్ర ఎలాంటి మలుపు తిరుగుతుందో అని నెటిజన్లు ఇప్పటి నుంచే గెస్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి దిశా పటానీ ‘కల్కి 2’లో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ప్రభాస్ సరసన ఆమె ఈసారి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి.