E-Paper
Advertisement

విజయ్ విడాకుల కేసు వాయిదా…భారీ భరణం డిమాండ్ చేస్తున్న సంగీత!

విజయ్ విడాకుల కేసు వాయిదా…భారీ భరణం డిమాండ్ చేస్తున్న సంగీత!
Advertisement

Vijay Sangeetha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సంగీత విడాకుల కేసు వాయిదా పడింది. సంగీత తన భర్త విజయ్(Vijay) నుంచి విడాకులు (Divorce) కోరుతూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ పిటిషన్ నేడు విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో నేడు విచారణ వాయిదా పడిందని తెలుస్తుంది. ఇక నేడు ఈ కేసు విచారణ వాయిదా పడటంతో తిరిగి జూన్ 15వ తేదీ విచారణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. జూన్ 15వ తేదీ తప్పనిసరిగా విజయ్ సంగీత ఇద్దరు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాలను జారీచేశారు. నేడు కోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూశారు కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది.

250 కోట్ల రూపాయలు భరణం డిమాండ్..

ఇక విజయ్ నుంచి సంగీత(Sangeetha) విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ఆమె భారీ స్థాయిలో డిమాండ్స్ చేస్తున్నారని సమాచారం. సంగీత విజయ్ నుంచి సుమారు 250 కోట్ల రూపాయలు భరణం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ సంగీత పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు. అలాగే ఆమె పేరు మీద వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అలాగే దాదాపు మూడు కిలోల వరకు బంగారు వెండి వజ్రాభరణాలను తీసి పెట్టినట్లు ఇటీవల ఎన్నికల అఫిడవిట్ లో విజయ్ పేర్కొన్నారు.

త్రిషతో విజయ్ రిలేషన్ కారణమా..

Advertisement

ఇలా తన భార్య సంగీతకు పెద్ద ఎత్తున ఆస్తులు ఇచ్చినప్పటికీ ఆమె విడాకులు తీసుకుంటున్నందుకు తన నుంచి ఏకంగా 250 కోట్ల రూపాయలు భరణం ఆశించారనే విషయం తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు ఇన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకొని విడిపోవాలనే నిర్ణయానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఎన్నో రకాల వార్తలొచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ నటితో విజయ్ రిలేషన్ లో ఉండటమే కారణమని తెలుస్తోంది.

జంటగా కనిపించిన త్రిష, విజయ్..

Advertisement

గత కొంతకాలంగా విజయ్ నటి త్రిష(Trisha) రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు బయటకు వస్తున్న తరుణంలోనే సంగీత కూడా విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా ఈ పిటిషన్ లో తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ ఆమె పేర్కొనటం గమనార్హం. ఇలా సంగీత తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో కచ్చితంగా ఈయన నటి త్రిషతో రిలేషన్ లో ఉన్నారని ఈ కారణంతోనే సంగీత విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తుంది. వీరి విడాకుల వార్తలు బయటకు వచ్చిన తర్వాత విజయ్ త్రిష ఇద్దరు జంటగా పలు సందర్భాలలో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. విడాకుల వ్యవహారం పూర్తి అయిన తరువాత విజయ్ త్రిష తమ బంధాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తన రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన తమన్నా… బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×