Vijay Sethupathi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా , నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతోనే నేడు పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. ఒకవైపు హీరోగా మరొకవైపు పవర్ఫుల్ విలన్ పాత్రలతో కూడా ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. ఇక అలాంటి ఈయన ప్రయాణం జీరో తో మొదలై నేడు వందల కోట్ల ఆస్తికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
48 సంవత్సరాల వయసున్న విజయ్ సేతుపతి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. నిజానికి చెన్నైకి చెందిన ఈయన.. పదహారేళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1994లో నమ్మవర్ అనే చిత్రానికి ఆడిసన్ ఇచ్చారు. కానీ హైట్ తక్కువ ఉండడంతో మేకప్ రిజెక్ట్ చేశారు. దీంతో కొన్నాళ్ళు దుబాయ్ కి వెళ్లి అక్కడ జీరో తో తన కెరీర్ ను మొదలుపెట్టాడు. అలా అకౌంటెంట్‌గా కెరియర్ మొదలు పెట్టిన ఈయన ఆ తర్వాత మళ్లీ సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ సైడ్ రోల్స్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. 2010లో వచ్చిన తెన్మెర్కు పరువుకాట్రు అనే చిత్రంతో మంచి బ్రేక్ అందుకొని.. ఇక అప్పటినుంచి వరుస అవకాశాలు అందుకున్న ఈయన.. తెలుగులో ఉప్పెన సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలా అప్పటినుంచి భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు విజయ్ సేతుపతి.
ఇక విజయ్ సేతుపతి బత్తా అనే కామెడీ డ్రామాలో నటించారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇకపోతే విజయ్ సేతుపతి నటుడి గానే కాకుండా మంచి పెట్టుబడిదారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. చెన్నైలో ఈయన సుమారుగా రూ.50 కోట్ల విలువ చేసే ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. తన అభిరుచికి తగ్గట్టుగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లు సమాచారం . ఈ ఇంటితోపాటు చెన్నై నగరంలో మరికొన్ని ఆస్తులు కూడా ఈయన కొనుగోలు చేశారు. చెన్నైలోని అత్యంత ప్రీమియం ప్రాంతాలలో ఒకటిగా నిలిచిన కిల్పాక్ ఏరియాలో ఆస్తి కలిగి ఉన్నారు. ఇది ఆయనకు దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తి అని చెప్పవచ్చు. అలాగే చెన్నైలోని ఒక ప్రముఖ ప్రాంతమైన వలరసవాక్కం లో ఒక కార్యాలయం కూడా ఉంది.
also read:8 కాదు 12.. ఈ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..ఎవరెవరున్నారంటే?
విజయ్ సేతుపతి తన అభిరుచికి తగ్గట్టుగా లగ్జరీ వాహనాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఆయన కారు గ్యారేజీలో ఉన్న వాహనాల విషయానికి వస్తే.. సుమారుగా రూ .1.76 కోట్ల విలువ చేసే ఫ్లాగ్ షిప్ లగ్జరీ సెడాన్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ ను ఆయన కొనుగోలు చేశారు. అలాగే 2 కోట్ల విలువ చేసే మెర్సిడేస్ బెంజ్ జి క్లాస్, 40 లక్షల విలువ చేస్తే వోక్స్ వ్యాగన్ మినీ కూపర్, టయోటా ఫార్చ్యూనర్ సెవెన్ సీటర్ ఎస్ యు వి, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు.
కార్లతో పాటు ఇతర వాహనాలను కూడా ఈయన కొనుగోలు చేశారు. ట్రేయాంఫ్ బోన్నెవిల్లే క్లాసిక్ బైక్ , 1974 జావా మోటార్ సైకిల్ వంటి బైక్ మోడల్స్ ను కలిగి ఉన్నారు.
అంతేకాదు 2025లో సినీ కార్మికుల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మద్దతుగా 1.30 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.
విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు సినిమా బడ్జెట్ ను బట్టి, తన పాత్రను బట్టి సుమారుగా 15 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటుండగా.. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తమిళ్ రియాలిటీ షో కోసం ఏకంగా 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.