Pragyan Ojha On Rohit Sharma Captaincy: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ప్రగ్యాన్ ఓజా (Pragyan Ojha) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్ల చాలా మ్యాచులు టీమిండియా ఓడిపోయిందని బాంబు పేల్చాడు. అతనికి బ్యాటింగ్ తప్ప కెప్టెన్సీ చేతకాదు అంటూ ప్రగ్యాన్ ఓజా ( Pragyan Ojha On Rohit Sharma Captaincy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యాన్ ఓజా… రోహిత్ శర్మ కెప్టెన్సీ పై కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మను బ్లేమ్ చేసేలా మాట్లాడినట్టు క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దీంతో వచ్చి రాగానే రోహిత్ శర్మను ఓజా టార్గెట్ చేసినట్టు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలను ఇంటర్వ్యూలో ప్రగ్యాన్ ఓజా ( Pragyan Ojha) బయట పెట్టారు. గతంలో ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ వల్ల చాలా మ్యాచులు ఓడిపోయినట్టు వివరించారు. కెప్టెన్సీ తీసుకున్న కొత్తలో రోహిత్ శర్మ అగ్రెసివ్ గా ఉండేవాడని.. ఆ తర్వాత అతని స్టైల్ పూర్తిగా మారిపోయిందన్నారు. మ్యాచ్ లపై పట్టు కోల్పోయాడని వివరించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉండేదన్నారు.
సింగిల్స్ రొటేట్ చేస్తూ టీమ్ ఇండియాను ఫుట్ బాల్ ఆడుకున్నారని తెలిపారు. అలాగే రోహిత్ శర్మ సరిగ్గా భవనాలను వాడుకోలేదని పేర్కొన్నారు. టీమిండియాలో అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లపై తగినంత ఒత్తిడిని తీసుకురావడంలో విఫలమైనట్టు గుర్తు చేశారు. రేపటి నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రగ్యాన్ ఓజా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అయితే ఈ విషయం తెలియకుండా కొంత మంది టీమిండియా చీఫ్ సెలెక్టర్ ప్రగ్యాన్ ఓజాపై రోహిత్ శర్మ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అజిత్ అగార్కర్ మొదటి వరకు యముడిలా ఉండగా.. ఇప్పుడు వచ్చి రాగానే రోహిత్ శర్మను ప్రగ్యాన్ ఓజా టార్గెట్ చేయడం దారుణం అంటూ ఆగ్రహిస్తున్నారు. ప్రగ్యాన్ ఓజా చీఫ్ సెలక్టర్ గా పనికిరాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ జోలికి వస్తే బాగుండదని హెచ్చరిస్తున్నారు.