Bigg Boss 10:ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగింది. ఒకరికొకరు కొట్టుకునే అంతవరకు వెళ్లారు. నువ్వెంత అంటే నువ్వెంత అని, దమ్ముంటే మాట్లాడు అని , ఇలా మాటలు కూడా జారుతూ ఒకరిపై ఒకరి విమర్శలు గుప్పించుకున్నారు. అంతేకాదు బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు. ఇకపోతే ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో 8 మంది నామినేట్ అయ్యారు అంటూ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు స్టార్ మా అఫీషియల్ గా నామినేట్ అయిన వారి లిస్టు ప్రకటించింది. అయితే ఈసారి ఏకంగా 8 కాదు 12 మంది నామినేట్ అయినట్లు ప్రకటించడంతో ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే ఈ ఏడవ వారం నామినేషన్ లో నిలిచిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. దక్ష గుత్తికొండ, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ నటరాజ్, రామకృష్ణ ఆర్కే, శివ, ఝాన్సీ, శ్వేత, రోహిత్, అమన్ ఇలా మొత్తం 12 మంది నామినేషన్ లోకి వచ్చారు. మరి ఓటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ జర్నీ ముందుకు సాగాలి అంటే జియో హాట్ స్టార్ లో ఓట్ చేసి నామినేషన్ నుంచి సేవ్ చేయండి అంటూ స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ 12 మందిలో ఈ వీక్ ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపిస్తారా లేక సింగల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.
also read:షాలిని ఈజ్ బ్యాక్.. షాక్ లో కంటెస్టెంట్స్!
ఇకపోతే తాజాగా ఆరవ వారం వర్షిణినీ సేవ్ చేసి షాలినినీ హౌస్ నుండి పంపించేసినట్లు కంటెస్టెంట్స్ అనుకున్నారు. కానీ షాలినినీ సీక్రెట్ రూమ్ కి పంపించి, ఆమెను సేవ్ చేశారు. బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ కి షాక్ ఇస్తూ షాలినిని హౌస్ లోకి పంపించారు. మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత షాలినీని హౌస్ లోకి తీసుకురావడంతో ఆమె సన్నిహితులు సంతోషం వ్యక్తం చేసినా మిగతా కంటెస్టెంట్స్ మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అపూర్వ , మిథిలేష్ , చరణ్ లాంటివాళ్లను మళ్ళీ హౌస్ లోకి తీసుకువచ్చినా ఎవరి ఆట వాళ్లదే అంటూ రాంప్రసాద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఇకపోతే గత ఆరు వారాలుగా ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటున్న వర్షిణి.. ఈ వారమైనా.. ఎలిమినేట్ అవుతుందా ? లేక ఇంకొకరు ఈమెను సేవ్ చేయడానికి బలవుతారా అన్న కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో..