E-Paper
Advertisement

Arasan: శింబుకు ధీటైన విలన్ గా విజయ్ సేతుపతి..

Arasan: శింబుకు ధీటైన విలన్ గా విజయ్ సేతుపతి..
Advertisement

Arasan: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా విజయ్ సేతుపతి హీరో గానే కాకుండా నటుడుగా కూడా తన సత్తా చాటుతున్నాడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో హీరోగారి కాకుండా విలన్ గా సపోర్టింగ్ రోల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సేతుపతి ముందు ఉంటాడు. ప్రస్తుతం తెలుగులో పూరి జగన్నాథ్ తో కలిసి హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా తమిళ్ లో  మరో రెండు ప్రాజెక్ట్స్ ను సేతుపతి లైన్ లో పెట్టాడు.

ఈ మధ్యనే పూరి జగన్నాథ్ సినిమా ఫినిష్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ చిత్రానికి చాలా టైటిల్స్ కూడా అనుకున్న విషయం తెలిసిందే. చివరికి బెగ్గర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.  త్వరలోనే ఈ టైటిల్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇది కాకుండా విజయసేతుపతి తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు హీరోగా స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అసరన్. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై హైప్  ను తీసుకొచ్చి పెట్టింది.

Advertisement

అయితే వెట్రిమారన్ శింబు కన్నా ముందు సూర్యతో ఒక సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. వాడి వసూల్ అనే టైటిల్ తో  సగం షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ఫినిష్ అవుతుంది అనుకున్న సమయంలో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సినిమానే ఇప్పుడు శింబుతో వెట్రిమారన్ చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ చూశాక ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అని అభిమానులు ఒక క్లారిటీకి వచ్చారు.

ఇక ఈ సినిమాను వెట్రిమారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అందుకే ప్రతి పాత్ర కోసం స్టార్స్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.  అందులో భాగంగానే ఈ చిత్రంలో ధీటైన విలన్ గా విజయసేతుపతిని ఎంపిక చేశారు. తాజాగా విజయసేతుపతిని అసరన్ లోకి మేకర్స్ అధికారికంగా ఆహ్వానించారు. శింబుకి ధీటైన విధంగా విజయసేతుపతి నటన నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో విజయసేతుపతి విలన్ గా నటిస్తున్నాడా లేక కీలకపాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే శింబు- విజయసేతుపతి కలిసి నవాబ్ సినిమాలో కలిసి నటించారు.  ఇప్పుడు మరోసారి అసరన్  కోసం వీరిద్దరూ కలుస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×