E-Paper
Advertisement

Proddatur News: గోల్డ్ వ్యాపారులు కిడ్నాప్ కేసు.. నిందితులకు బెయిల్, పోలీసులపై చర్యలు

Proddatur News: గోల్డ్ వ్యాపారులు కిడ్నాప్ కేసు.. నిందితులకు బెయిల్, పోలీసులపై చర్యలు
Advertisement

Proddatur News: సస్పెన్స్ సినిమా మాదిరిగా బంగారు వ్యాపారులు కిడ్నాప్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి బెదిరించారు ప్రొద్దుటూరుకు చెందిన తనికంటి జ్యూవెలర్స్‌ నిర్వాహకులు. చివరకు వారిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. 20 వేల సొంత పూచికత్తుపై జ్యూవెలర్స్ నిర్వాహకులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలిపై పలు ప్రశ్నలు లేవెత్తారు న్యాయమూర్తి. అసలేం జరిగింది? అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ప్రొద్దుటూరు గోల్డ్ వ్యాపారులు కిడ్నాప్ కేసు

Advertisement

ఎనిమిదేళ్ల కిందట సరిగ్గా 2018లో హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ వ్యాపారి హేమంత్‌శర్మ.. ప్రొద్దుటూరుకి చెందిన తనికంటి జ్యూవెలర్స్‌ నిర్వాహకులు శ్రీనివాసులు, వెంకటస్వామిలకు 10 కేజీల బంగారం ఆభరణాలు ఇచ్చాడు. అందుకు మనీని 2021లో డబ్బులు ఇస్తామని హేమంత్‌శర్మకి చెప్పారు.  ఈ క్రమంలో ఐదురోజుల కిందట ప్రొద్దుటూరుకు పిలిపించారు తనికంటి జ్యూవెలర్స్‌.

కొర్రపాడు రోడ్డులో వెయిట్ చేస్తున్న హేమంత్‌శర్మ, ఆయన సోదరుడు నిఖిల్‌శర్మలను తనికంటి శ్రీనివాసులు తన అనుచరులతో వచ్చి కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఓ గదిలో బంధించి దాడి చేశారు. చివరకు హేమంత్ శర్మ వద్దనున్న డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకున్నారు.

Advertisement

నిందితులకు బెయిల్, పోలీసులపై చర్యలు

ఈ ఘటనపై ఈనెల 20న దాడి, కిడ్నాప్‌, దోపిడి, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో సోమవారం శ్రీనివాసులు, వెంకటస్వామిలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి, త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ బలవంతంగా అప్పు చెల్లించాలని తమపై ఒత్తిడి చేశారని వెల్లడించారు బాధితులు.

పోలీసులు తమను కొట్టినట్లు  నిందితుడు  వెంకటస్వామి న్యాయమూర్తి ముందు చెప్పారు. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు.  ఆ తర్వాత నిందితుల స్టేట్మెంట్ ను రికార్డు చేశారు ప్రొద్దుటూరు మొదటి ఆడిషనల్ కోర్టు జడ్జి. కేసు విషయమై కోర్టులో వాదోపవాదనలు పూర్తికావడంతో తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి.

ALSO READ: బెంగుళూరులో దారుణం.. బీబీఏ విద్యార్థిని దారుణహత్య

తనకంటి జ్యువెలర్స్ యజమాని శ్రీనివాసులు , వెంకటస్వామిలకు 20వేల సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. అదే సమయంలో పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నించారు సదరు న్యాయమూర్తి. నిందితులకు ఏ చిన్న అపాయం జరిగినా అందుకు పోలీసులు బాధ్యత వహించాలని అన్నారు. వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డి, త్రీ టౌన్ సిఐ వేణుగోపాల్‌లను హెచ్చరించారు.

ఇదిలాఉండగా ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయన్ని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. బంగారం వ్యాపారులపై నమోదైన కేసులో సీఐ తీరుపై విమర్శలు వచ్చాయి. పోలీసుల వ్యవహారశైలిపై లోతుగా విచారణ చేస్తామన్నారు ఆ జిల్లా ఎస్పీ న‌చికేత్. ఈ కేసు దర్యాప్తు ప్రొద్దుటూరు డీఎస్పీ అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×