Vijay Thalapathy:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసి 234 స్థానాలకు గానూ 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచారు . టీవీకే పార్టీతో ప్రజల ముందుకు వచ్చి ప్రజల మన్ననలను సొంతం చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించిన విజయ్ దళపతి మరి కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అందులో భాగంగానే విజయ్ దళపతి పదవ తరగతి బోర్డు ఎగ్జామ్స్ మార్క్స్ మెమో షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో విజయ్ తన పదవ తరగతి బోర్డు పరీక్షల్లో 65% మార్కులు సాధించారు. మొత్తం 1100 మార్కులకు గాను 711 మార్కులు సాధించారు. ఓవరాల్గా 65% పొందారు విజయ్. ఇకపోతే తన మాతృభాషా అయిన తమిళంలో 200కి 155 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచిన ఈయన.. ఇంగ్లీషులో 200 కి 133 , సైన్స్ లో 300 కి 206 , సోషల్ సైన్స్ లో 200 కి 122 , గణితంలో 200కి కేవలం 95 మార్కులు మాత్రమే సాధించాడు. ఇకపోతే మాథ్స్ సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు రావడంతో విజయ్ మాథ్స్ లో అంత వీకా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే లెక్కల్లో విజయ్ తక్కువ మార్కులు తెచ్చుకున్నా.. ఇప్పుడు పాలిటిక్స్ లో అత్యధిక సీట్లు సాధించి అందర్నీ మెప్పించారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే విజయ్ పదవ తరగతి మార్క్స్ మెమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే విజయ్ తన ప్రారంభ విద్యను కోడంబాక్కంలోని ఫాతిమా హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత బాలలోక్ మెట్రిక్యులేషన్ సెకండరీ పాఠశాలలో చేరిన ఈయన లయోలా కాలేజ్ లో బ్యాచిలర్ డిగ్రీ లో విజువల్ కమ్యూనికేషన్ లో చేరిన విజయ్ తన చదువును మధ్యలోనే ఆపేశారు.
ALSO READ:ఘనంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’దర్శకుడి పెళ్లి.. వధువు బ్యాక్ గ్రౌండ్ వైరల్!
విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. 1999 ఆగస్టు 25న తన అభిమాని సంగీత సోర్నలింగం అనే అమ్మాయిని హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఒకసారి చెన్నైలో, ఒకసారి లండన్ లో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. ఇకపోతే విజయ్ సంగీత దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్న విషయం తెలిసిందే వీరిద్దరూ కూడా విజయ్ సినిమాలలో అరంగేట్రం చేశారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నారు అనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో సంగీత ఈయనతో విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పై విచారణ కూడా నడుస్తోంది.