E-Paper
Advertisement

హెచ్‌సీఏ జిమ్మిక్కులపై టీసీఏ వార్నింగ్.. 48 గంటలే డెడ్‌లైన్ లేదంటే కోర్టుకే..!

హెచ్‌సీఏ జిమ్మిక్కులపై టీసీఏ వార్నింగ్.. 48 గంటలే డెడ్‌లైన్ లేదంటే కోర్టుకే..!
Advertisement

TG20 League: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​ (హెచ్సీఏ) నిర్వహించ తలపెట్టిన టీజీ20 లీగ్​ టోర్నమెంట్​ పై తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ (టీసీఏ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం హెచ్​సీఏకు అధికారికంగా లీగ​ల్ నోటీస్​ పంపించింది. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి కూడా వినతిపత్రం పంపించింది. త్వరలోనే టీజీ2‌‌0 టోర్నీని ప్రారంభించనున్నట్టు ఇటీవల హెచ్​సీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం గవర్నింగ్ కౌన్సిల్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, టీజీ 20 లీగ్ నిర్వహణకు హెచ్​సీఏ బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి తెలిపారు. అయినా, అనుమతులు తీసుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్నట్టయితే వాటిని బహిర్గతం చేయాలని డిమాండ్​ చేశారు.

అనుమతులు ఉన్నాయంటూ..

అసలు టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్​ కు హెచ్​సీఏ జనరల్ బాడీ ఆమోదం ఉందా? లేదా? అన్న విషయాన్ని వెల్లడించాలన్నారు. హెచ్​సీఏ అక్రమంగా తెలంగాణ క్రికెట్​ వ్యవస్థను హస్తగతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారిక ఈ మెయిళ్లకు సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందన్నారు. అదే సమయంలో అనుమతులు ఉన్నాయంటూ కార్పోరేట్ సంస్థలు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, క్రికెట్ వర్గాలను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ వెలుపల జిల్లాల్లో గత పన్నెండేళ్లుగా టీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా కొనసాగుతున్నట్టు తెలిపారు. 2021, జూలై 11న బీసీసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం టీసీఏతో సంప్రదింపులు జరిపి హెచ్​సీఏ పని చేయాల్సి ఉందన్నారు.

Advertisement

Also Read: రవాణా శాఖలో కొత్త శకం.. కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి సూపర్ చాన్స్..?

జూన్​ లో…

ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు టీసీఏ జూన్ లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను పారదర్శకంగా ప్రారంభించనున్నట్టు ధరం గురువారెడ్డి చెప్పారు. హెచ్​సీఏ చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి కార్పోరేట్ సంస్థలు, స్పాన్సర్లు, బ్రాడ్​ కాస్టర్లు, వెండర్లు డబ్బులు ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇప్పటికే ఈ అంశంపే బాంబే హైకోర్టులో విచారణ నడుస్తోందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో హెచ్సీఏ ఏకపక్షంగా లీగ్ ను ప్రకటించటం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నమే అని పేర్కొన్నారు. 48గంటల్లో బీసీసీఐ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Also read: మిషన్ తెలంగాణకు షా స్కెచ్.. బీఆర్ఎస్ నేతలే వారి టార్గెట్.. హైదరాబాద్‌లో తిష్ట వేయనున్న బెంగాల్ టీమ్!

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×