E-Paper
Advertisement

Vijay Thalapathy : విజయ్ మరో షాక్.. సీబీఐ ఎదుట విచారణకు హాజరు..

Vijay Thalapathy : విజయ్ మరో షాక్.. సీబీఐ ఎదుట విచారణకు హాజరు..
Advertisement

Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి వరుసగా షాక్ లు ఎదురవుతున్నాయి.. ఈయన సినిమా అడ్డంకులు ఎదురవడంతో విడుదల ఆగిపోయింది. ఇప్పుడు మరో వార్త విజయ్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.. గతంలో ఈయన పార్టీ సమావేశంలో పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. తమిళనాడు చరిత్రలోనే ఇది మర్చిపోలేని ఘటన.. కరూర్‌ తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.. గత ఏడాది సెప్టెంబర్ 27 న ఈ ఘటన ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లను మిగిల్చింది. టీవీకే పార్టీ సమావేశంలో ఎంతోమంది విజయ్ అభిమానులు ప్రాణాన్ని విడిచారు. కరూర్‌ తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్‌ హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీనిని టీవీకే సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు సీబీఐ కి అప్పగించింది. నేడు సిబీఐ విచారణకు విజయ్ హాజరుకానున్నారని తెలుస్తుంది..

సీబీఐ విచారణకు హీరో విజయ్ హాజరు..

కోలీవుడ్ హీరో విజయ్ తన పార్టీకి సంబందించి కరూర్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎంతోమంది విజయ్ అభిమానులు పాల్గొన్నారు. అయితే అక్కడ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.. ఎండలో తిండి, నీళ్ల లేకపోవడంతో సొమ్మసిల్లి పడిపోవడం.. వాళ్లకు సాయంగా విజయ్‌ వాటర్‌ బాటిళ్లు విసరడం.. ఆ గందరగోళంలోనే ఆంబులెన్స్‌ రాకతో జనం మధ్య తొక్కిసలాట జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అధికార డీఎంకే, టీవీకే పరస్పరం నిందించుకున్నాయి. కరూర్‌ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని స్టాలిన్‌ సర్కార్‌ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఓటు ఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని సిబిఐ కి అప్పగించింది. నేడు విచారణకు హీరో విజయ్ హాజరుకానున్నారు. విచారణ అనంతరం తొక్కిసలాట జరగడానికి కారణాలు ఏంటో తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Also Read : నయనతార క్రేజే వేరు..’ టాక్సిక్’ మూవీకి రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే..?

జన నాయగన్‌పై రాజకీయ దుమారం..

విజయ్ దళపతి నటిస్తున్న చివరి సినిమా జన నాయగన్.. ఈ సినిమాలో అభ్యంతరకరపు సీన్లు ఉన్నాయని సెన్సార్ బోర్డు తెలిపింది. దాంతో సినిమా విడుదల అవ్వడానికి ఒక్కరోజు ముందు వాయిదా పడింది. దీంతో చిత్ర నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కారు.. విచారణ జరిపిన కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాలని ఆమోదించింది. అక్కడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..జననాయగన్ CBFC కేసుకు సంబంధించి KVN ప్రొడక్షన్స్ నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చెయ్యనుంది. ఈ కేసును రేపు వీలైనంత త్వరగా విచారించనున్నట్లు సమాచారం.. ఇక సినిమా విడుదల తేదీగా సంగ్దిగ్దం నెలకొంది.. మరో మూడు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడేమో ఈ సినిమా వాయిదా పడింది.. మరి విజయ్ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది? ఏది ఏమైనా సరే ఈ ఏడాది జరగబోతున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని విజయ్ గతంలో ప్రకటించారు. మరి ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీకి ఎన్ని స్థానాల్లో పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంటుందో.. ఏమైనా కూడా ప్రస్తుతం విజయ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.. ఒకవైపు సినిమా మరోవైపు పార్టీకి కష్టాలు వీటన్నిటినీ విజయ్ ఎలా అధిగమిస్తాడో చూడాలి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×